వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఆయన అన్ని విధాలా అర్హులంటూ శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలీన్ లివెట్ ఒక ప్రకటన చేశారు. ఈజిప్ట్-ఇథియోపియా మొదలు ఇటీవల థాయిలాండ్-కాంబోడియా మధ్య రాజీకి ట్రంప్ ప్రయత్నించారని, యుద్ధాలు ఆపారని కరోలీన్ వెల్లడిరచారు. ఘర్షణ పడే దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు ఫోన్లు చేసి యుద్ధం ఆపేయాలని హెచ్చరించారని, ట్రంప్ జోక్యం తోనే ఇజ్రాయిల్‌ఇరాన్, రువాండా-కాంగో (డీఆర్సీ), భారత్‌పాకిస్థాన్, సెర్బియాకొసావో, ఈజిప్ట్-ఇథియోపియా, థాయిలాండ్‌కంబోడియా దేశాల మధ్య యుద్ధాలు ఆగాయని మీడియా సమావేశంలో కరోలీన్ తెలిపారు. ట్రంప్ జోక్యం చేసుకొని వుండకపోతే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగేదని అన్నారు. ఉద్రిక్తతలు చల్లార్చి… శాంతిని నెలకొల్పిన ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
నోబెల్‌కు ట్రంప్ అర్హుడు శ్వేతసౌథం
- Advertisement -
RELATED ARTICLES


