ఎవరైనా నోరు జారొచ్చు. అలా నోరు జారినప్పుడు అసంకల్పితంగానే నిజాలు బయట పెట్టొచ్చు. ఆ నిజం ఇబ్బందికరమైంది అయినప్పుడు ఆ నిజం చెప్పిన వారే తాను ఆ మాట అనలేదని వితండవాదానికి దిగొచ్చు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇప్పుడు ఇదే సంకట స్థితిలో పడిపోయారు. ఆయన ఎవరి అధీనంలో అయితే జాతీయ భద్రతా సలహాదారుగా పని చేస్తున్నారో వారి నడవడిక ప్రభావం ఆయన మీద కూడా అమితంగానే ఉండొచ్చు. మోదీ ప్రభుత్వానికి దోవల్ సలహాదారుగా ఉన్నారు. మోదీ నిత్యం అబద్ధాలు చెప్తున్నారు. ఈ లక్షణం అనుద్దేశపూరితంగానే దోవల్‌కు అంటుకుని ఉండొచ్చు. ‘‘పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ తీవ్రవాదులుగా చేర్చుకున్న వారిలో ముస్లింల కంటే హిందువులే ఎక్కువగా ఉన్నారు.’’ అని చెప్పారు. ఈ మాట సత్యం అయినందువల్ల అబద్ధాలకు అలవాటుపడిన పాలకులకు మింగుడు పడదు కనక ఇప్పుడు తాను ఆ మాట అనలేదని దబాయిస్తున్నారు. అదంతా డీప్ ఫేక్ అంటున్నారు. డీప్ ఫేక్ అంటే కృత్రిమ మేధను ఉపయోగించి అసత్యాన్ని ప్రచారంలో పెట్టడం. నిజంగా ఇలాంటివే జరిగితే అచ్చు గుద్దినట్టు నిఖార్సైన సత్యంగా కనిపిస్తాయి. అంటే తప్పుడు సమాచారమే అసలైన సమాచారంగా చెలామణి అవుతుంది. కానీ అజిత్ దోవల్ నిజంగానే ‘‘ఐ.ఎస్.ఐ.పట్ల ముస్లింల కన్నా హిందువులే ఎక్కువ ఆకర్షితులు అయ్యారు’’ అన్న మాట వాస్తవం అని అనేక వాస్తవాలు తేల్చి చెప్పే వారు ఘంటాపథంగా ప్రకటిస్తున్నారు. అజిత్ దోవల్ నోట ఇలాంటి మాట వెలువడడం ఆయనకే కాదు ఆయన ప్రభువులకు కూడా చాలా ఇబ్బందికరమైందే. ఆయన మాటలు నిజమా కాదా అన్న అంశాన్ని కాసేపు పక్కన పెట్టినా కేవలం ముస్లింలే తీవ్రవాదులు కారని, హిందువులలో కూడా తీవ్రవాదులు ఉంటారన్న సత్యం బయటపడ్తుంది. ఇది అజిత్ దోవల్‌కు నష్టమే కలిగిస్తుంది. అందుకే అమాంతం మాట మార్చేశారు. తాను అసలు మాటే మాట్లాడలేదని, తన మీద పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని దోవల్ వాదిస్తున్నారు. ఇది జాతీయ భద్రతకు ప్రమాదకరం అని కూడా హెచ్చరిస్తున్నారు. ఇస్లామిక్ తీవ్రవాదం దేశానికి ఎంతటి చేటు తెస్తుందో హిందుత్వ వాదుల తీవ్రవాదం, లేదా కాషాయ తీవ్రవాదం కూడా అంతే హాని చేస్తుంది. హిందుత్వ తీవ్రవాదం ఉంది అని అజిత్ దోవల్ తన నోటితో చెప్పి ఉండొచ్చు కానీ ఆయన దాన్ని ఎలా అంగీకరించగలరు కనక. కానీ ఆయన చెప్పిన ఈ మాట సామాజిక మాధ్యమాలలో అప్పుడే విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. కృత్రిమ మేధస్సు వల్ల ఎంత పెద్ద ముప్పు ఉందో కూడా అజిత్ దోవల్ వివరిస్తున్నారు. అజిత్ దోవల్ ఈ మాట చెప్పడం ఆయన అంగీకరించినా అంగీకరించక పోయినా ప్రస్తుత భౌగోళిక రాజకీయాలలో దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. మన దేశంలో ప్రస్తుతం మతాల వారీగా జనాన్ని చీల్చడం జోరుగా కొనసాగుతోంది. అందువల్ల ఈ సమయంలో దోవల్ ఇలాంటి మాట అన్నారంటే దాని పరిణామాలు విపరీతంగానే ఉంటాయి. ఇదే ఆయన బాధ. అందుకే తీరిగ్గా నాలిక కరుచుకుంటున్నారు. తాను అనని మాటలు అన్నానని ప్రచారం జరగడంవల్ల తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటానికి విఘాతం కలుగుతుందని దోవల్ చెప్తున్నారు. దోవల్ ఆ మాట అన్నారా అనలేదా అన్న దానికన్నా హిందూ తీవ్రవాద ముప్పు తక్కువేమీ లేదు. ముస్లింలు అనే బూచిని చూపించి మోదీ ప్రభుత్వం హిందువులలో లేనిపోని భయం కలిగిస్తోంది. కానీ హిందువుల్లోనే అలాంటి లక్షణాలు ఉన్న వారున్నారు అంటే అది బీజేపీ అనుసరించే విధానాలనే బహిర్గతం చేస్తుంది కనక ఆ విషయాన్ని ససేమిరా అంగీకరించరు. అజిత్ దోవల్ అన్న మాటలు, వాటి ప్రభావం యాదృచ్చికంగా జరిగిన సంఘటనలేమీ కావు.
ఒక సుదీర్ఘ ప్రసంగంలో అజిత్ దోవల్ ఈ మాటలు అన్నారు. అజిత్ దోవల్ అన్న ఈ మాటలు దావానలంలా విస్తృతంగా వ్యాపిం చాయి. దీనితో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. జాతీయ భద్రతా సలహాదారు స్థానంలో ఉన్న వ్యక్తి యథాలాపంగా మాట్లాడితే ఇలాంటి ఇబ్బందులు తప్పవు. కానీ ఆయన మాటల్లోని అంతస్సారం హిందూ తీవ్రవాదం ఉందన్న వాస్తవికతను చాటి చెప్తోంది. ఆయన మాటలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి, ఆయన ఖండిరచడం మొదలు పెట్టిన తరవాత కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఆయన ప్రసంగ పాఠాన్ని తవ్వి తీసి అసలు విషయం బయట పెట్టాయి. దీనితో ఆయన బండారం బయట పడిరది. ఒక మతానికి చెందిన వారు మాత్రమే తీవ్రవాదులు అవుతారు అన్న బూటక ప్రచారం పస కూడా తేలి పోయింది. హిందువులకు ప్రమేయం ఉన్న అనేక తీవ్రవాద కార్యకలాపాలు చాలాసార్లు వెలికి వచ్చాయి. వారి మీద కేసులు కూడా కోర్టులకు ఎక్కాయి. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మీద ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఆమె 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలు. ఆ పేలుళ్లలో 10 మంది మరణించారు. 82 మంది గాయపడ్డారు. అప్పుడు ఆమెను అరెస్టు కూడా చేశారు. కేసులు కూడా మోపారు. 2017 లో ఆరోగ్య కారణాలవల్ల ఆమెకు బెయిలు కూడా వచ్చింది. ఆమె 2019 లో సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి దిగ్విజయ్‌సింగ్‌పై భారీ మెజారిటీతో గెలిచారు. ఆమె రక్షణ శాఖ పార్లమెంటరీ సలహ సంఘ సభ్యురాలు కూడా అయ్యారు. ఆమె నాథూరాం గాడ్సేను దేశభక్తుడని మూడు సార్లు కీర్తించారు. ఇది తీవ్ర విమర్శలకు గురైంది. ఆ తరవాత ఆమెను పార్లమెంటరీ సలహా కమిటీలోంచి తొలగించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు కూడా ఆమెను హాజరు కానివ్వలేదు. ఇదంతా ఆమె తీవ్రవాద చర్యలకు పాల్పడినందుకు నిదర్శనమే కదా. ఆమె నాథూరాం గాడ్సేను కీర్తించడాన్ని ప్రతిపక్షాలు ఎలాగో దుయ్యబట్టాయి. అంతటితో ఆమె కథ ముగియ లేదు. ఆమె సొంత పార్టీ అయిన బీజేపీ నాయకులు కొందరు కూడా తీవ్రంగా ఖండిర చారు. 2007 ఫిబ్రవరి 18 న సంరaౌతా ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు బోగీలలో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఇందులో 68 మంది మరణించారు. అనేక డజన్ల మంది గాయపడ్డారు. దీనికి అభినవ భారత్ కారణమన్నారు. సంరaౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుళ్లలో తన పాత్ర ఉందని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకుడు అసీమానంద్ అంగీకరించారు కూడా. అలాగే 2007 అక్టోబర్ 11 న అజ్మీర్‌లోని సుఫీ సన్యాసి దర్గా వద్ద పేలుడు జరిగింది. దీనికి సంఫ్‌ు పరివార్ కారణమన్నారు. ఈ కేసులో అయిదుగురు ఆర్‌ఎస్‌ఎస్ వారిని అరెస్టు చేశారు. ఈ తీవ్రవాద దాడికి ఆదేశం జారీ చేసింది ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ అని కూడా అసీమానంద్ వెల్లడిరచారు. అజిత్‌దోవల్ నిజం చెప్పిన ప్పుడు ఈ సంఘటనలన్నీ ఆయన దృష్టిలో ఉండే ఉంటాయి.
నోరు జారి నిజం చెప్పిన దోవల్
- Advertisement -


