- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో గల తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా మాడవీధులలో అంశ వాహనం ముందు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందినటువంటి మానస నృత్య కళాకేంద్రం వారి శిష్య బృందం ప్రదర్శించిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. మొత్తం 25 మంది నృత్య కళాకారులచే ఈ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం గురువు ఆర్ మానస మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించడం అదృష్టదాయకంగా, పూర్వజన్మ సుకృతంగా తాము భావిస్తున్నామని తెలిపారు.


