విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణం లోని కె.హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు కల్నల్ అలోక్ త్రిపాఠి, గ్రూప్ కమాండర్ , ఎన్ సి సి గ్రూప్ కర్నూల్, కల్నల్ మానీష్ సుబ్బా ఆఫీసర్ కమాండింగ్ 6(ఏ) బి ఎన్. ఎన్ సి సి, అనంతపురం, కల్నల్ ఎల్. డి. రోద్రీజ్ 6(ఏ) గర్ల్స్ బి ఎన్ అనంతపురం, ఇతర ఎన్. సి. సి. సిబ్బంది కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కల్నల్ అలోక్ త్రిపాఠి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ సి సి ప్రాధాన్యత ను వివరించి, చేయాల్సిన ఆవశ్యకత ను వివరించారు. భవిష్యత్తు లో చేరడం వల్ల ఉండే ఉపయోగాలను తెలిపారు. జీవితంలో అత్యున్నత స్థానానానికి చేరుటలో ఎన్ సి సి కీలక పాత్ర పోషిస్తుందని ఎన్.సి.సి.క్యాడెట్లకు అభివందనలు తెలిపారు. ఈ కార్యక్రమం
ఎన్.సి.సి.ఎ.ఎన్.ఓ. లెఫ్టినెంట్ యస్. పావని, పర్యవేక్షణ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ . పావని, ఎస్.చిట్టెమ్మ, ఎ కిరణ్ కుమార్ ,డా ఎస్. షమీఉల్లా
డా|| బి. గోపాల్ నాయక్ యం భువనేశ్వరి , యం పుష్పావతి, బి.ఆనంద్,జీ. మీనా, జీ.ధనుంజయ తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఎన్. సి. సి. గ్రూపు కమాండర్ సందర్శనం
- Advertisement -
RELATED ARTICLES


