Homeజిల్లాలుఅనంతపురంవిజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి

విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను వినియోగించుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తునే తమ అభిరుచి మేరకు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రంథాలయలో పాఠకుల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలు, సౌకర్యాలును ప్రభుత్వాలు కల్పించి పాఠకులు సంఖ్యను పెంచాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాసిల్దార్ నరేష్, మండల విద్యాశాఖ అధికారి ఎర్రి స్వామి, చాబాల సర్పంచ్ జగదీష్, గ్రంథాలయ అధికార శ్రీనివాసులు గ్రంథాలయాల యొక్క ఉపయోగాలు గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధాన చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు