తీవ్రమైన తలనొప్పి, మతిమరుపు లాంటి సమస్యలు ఆరు గంటల శస్త్రచికిత్సతో నయం చేసిన కిమ్స్ సవీరా వైద్యులు
విశాలాంధ్ర- అనంతపురం : ఆయన కాయకష్టం చేసుకునే రైతు. వయసు 47 ఏళ్లు. అప్పటివరకు పెద్దగా ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు విపరీతమైన తలనొప్పి వచ్చింది. తర్వాత క్రమంగా కొన్ని విషయాలు మర్చిపోవడం మొదలైంది. దీంతో ఆయన అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి రావడం జరిదని కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ సి. అనిల్ మరియు డా. మురళీ తేలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…కనేకల్లుకు చెందిన పకీరప్ప అనే ఆ రైతు తీవ్రమైన తలనొప్పి, మతిమరుపు, ఇతర లక్షణాలతో మా వద్దకు రావడం జరిగిందన్నారు. వెంటనే ఆయనకు సీటీ యాంజియోగ్రామ్ పరీక్ష చేసి అసలు సమస్య ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేశామన్నారు. అత్యాధునిక మైక్రోసర్జికల్ విధానాలు, ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్ సహాయంతో శస్త్రచికిత్స. దాదాపు ఆరు గంటలకు పైగా సాగిన ఈ శస్త్రచికిత్సలో అత్యంత జాగ్రత్తగా ఉబ్బిన నరాలను పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు . దాంతో మెదడులోకి రక్తప్రసారం సాధారణ స్థితికి చేరుకుంది. ఇలా ఏవీఎం అనేది లక్షమందిలో ఒకరికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన సమస్య. ఈ శస్త్రచికిత్స చేసిన తర్వాత రోగి చాలా త్వరగా కోవడం జరిగిందన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఐదో రోజునే ఆయన్ను డిశ్చార్జి చేసామన్నారు. మాట, నడక అన్నీ సాధారణంగానే ఉంటూ.. ఆయన తన పనులన్నీ తాను చేసుకోగలుగుతున్నారు.


