. జనాభా, ఆదాయం ప్రాతిపదికన 4 గ్రేడ్లుగా విభజన
. క్లస్టర్ల వ్యవస్థ స్థానంలో స్వతంత్ర యూనిట్లు
. ఏపీఐఐబీ రూ.1,27,181 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
. విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు 480 ఎకరాలు
. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్‌భవన్
. దొనకొండలో రూ.1200 కోట్లతో బీడీఎల్
. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: గ్రామ పంచాయతీల్లో సంస్కరణలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించేలా, మరింత మెరుగ్గా పనిచేసేలా తగిన స్టాఫింగ్ నమూనా, పరిపాలనా వ్యవస్థతో గ్రామ పంచాయతీల పునఃవర్గీకరణ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం గ్రామ పంచాయతీ పరిపాలనలో 48 సంవత్సరాల తరువాత జరుగుతున్న అతిపెద్ద సంస్కరణగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుమారు 34 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 7,244 గ్రామ పంచాయతీ క్లస్టర్లను రద్దు చేసి… మొత్తం 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా పరిగణస్తారు. జనాభా, ఆదాయం ఆధారంగా గ్రామ పంచాయతీలను స్పెషల్ గ్రేడ్,1,2,3,4 వర్గాలుగా పునర్వ్యవస్థీకరించనున్నారు. 359 గ్రేడ్-1 పంచాయత్ సెక్రటరీ పోస్టులను స్పెషల్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా డిప్యూటీ మండల్ పరిషత్‌్ అభివృద్ధి అధికారి కేడర్‌లో అప్‌గ్రేడ్ చేస్తారు. ఐదుగా ఉన్న గ్రేడ్లను మూడు గ్రేడ్లుగా కలపడం ద్వారా పంచాయత్ సెక్రటరీ పోస్టుల హేతుబద్ధీకరణ జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీ పదనామాన్ని పంచాయత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పునఃనామకరణం చేస్తూ స్పెషల్ గ్రేడ్ గ్రామ పంచాయతీల్లో 359 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. తాజాగా ఏపీఐఐబీ సమావేశం రూ.1,27,181 కోట్ల విలువైన ప్రాజెక్టులు, 78,771 ఉద్యోగాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లాలో అధునాతన కార్బన్ కాంప్లెక్స్ తయారీ, పలనాడు జిల్లాలో సిమెంట్ ప్లాంట్, గుడిపల్లి టేకులోడు(అనంతపురం జిల్లా)లో ఏరోస్పేస్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీ పరిశ్రమల స్థాపనకు సమావేశం ఆమోదం తెలిపింది. సుమారు రూ. 5,800 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమల ద్వారా 6,646 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రొపెల్లెంట్ ప్లాంట్‌కు, కర్నూలు జిల్లాలో పారిశ్రామిక ఎస్టేట్ అభివృద్ధికి, విశాఖపట్నం జిల్లాలో పారిశ్రామిక అండ్ లాజిస్టిక్స్ హబ్‌కు, కర్నూలు జిల్లాలో ఇన్నోవేషన్ సెంటర్‌కు, విజయనగరం జిల్లాలో ప్రైవేట్ మెగా పార్క్‌కు అవసరమైన భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో డేటా సెంటర్‌తో పాటు అమరావతిలో 4-స్టార్ హోటళ్లు, విశాఖపట్నం జిల్లా అరకు వ్యాలీలో ఒక లగ్జరీ రిసార్ట్, శ్రీశైలం(నంద్యాల జిల్లా)లో 3-స్టార్ హోటల్, కాకినాడ జిల్లాలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు, సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అనంతపురం, విజయనగరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోను, కర్నూలు, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లో ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు.
అ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు సిఫార్సు చేసిన విధంగా రూ.87,520 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడి ద్వారా మెస్సర్స్ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు-పవర్డ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం జిల్లాలోని అడవివరం, తర్లువాడ గ్రామాలు, అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో 480 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.
అ లూలూ గ్రూప్‌లో భాగమైన ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్‌లోని 7.48 ఎకరాల కోర్ ప్రాసెసింగ్ సెంటర్‌ను 66 ఏళ్లకుగాను సంవత్సరానికి రూ.50 లక్షలకు లీజుకు కేటాయించారు. పండ్ల ప్రాసెసింగ్ లైన్లు, మూడు వేల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్, రైపెనింగ్ చాంబర్లు, వేర్‌హౌసింగ్ సామర్థ్యంతో కూడిన ఈ అత్యాధునిక సౌకర్యం స్థానికంగా సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తుంది.
అ అనకాపల్లిలోని జేఎన్ ఫార్మాసిటీలో ఎమ్మెన్నార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.18.09 కోట్ల ప్రాజెక్టు అమలు ఆలస్యానికి విధింపబడిన జరిమానా రుసుములలో మినహాయింపునకు మంత్రివర్గం ఆమోదం
అ రక్షణ మంత్రిత్వ శాఖ సార్వజనిక రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌కు ప్రకాశం జిల్లా దొనకొండ గ్రామంలో ప్రొపెల్లెంట్ ఉత్పత్తి సౌకర్యం, ఆయుధ వ్యవస్థ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ స్థాపించడానికి 1,400 ఎకరాలు కేటాయించారు.
అ విశాఖపట్నం బీచ్ రోడ్‌లో మెగా షాపింగ్ మాల్ ప్రాజెక్ట్ కోసం లూలూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 13.74 ఎకరాల కేటాయింపు.
అ నాలుగు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలను ఆమోదిస్తూ మంత్రివర్గం నిర్ణయం.
అ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్టు ఫార్మేషన్ రూల్స్-1984లోని నిబంధన (5)కు అనుగుణంగా ఏఎస్‌ఆర్ జిల్లా వై.రామవరం మండలం రంపచోడవరం డివిజన్ రెండు మండలాలుగా విభజన.
అ కార్మిక, ఉపాధి శాఖ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, 1947లోని సెక్షన్ 2-ఏ, 23కు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 2020 ప్రకారం సవరణకు ఆమోదం.
అ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా కార్మిక కోర్టులకు అనుగుణంగా చేసేందుకు ‘ది లేబర్ లాస్ బిల్2025’ అమలుకు నిర్ణయం. అ అమరావతి ప్రభుత్వ సముదాయ ప్రాంతంలో గవర్నర్ నివాస సముదాయంగవర్నర్ మాన్షన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, అఫీషియల్స్ అండ్ స్టాఫ్ క్వార్టర్స్ మొదలైనవాటితో కూడిన నిర్మాణ పనులకు రూ.212.22 కోట్ల పరిపాలనా ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం.
ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి గుర్తింపును బలోపేతం చేస్తుందని, గవర్నర్ నివాస సముదాయ నిర్మాణం పరిపాలనా సామర్థ్యం, రాజ్యాంగ గౌరవాన్ని పెంచుతుందని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు మంత్రి వెల్లడిరచారు. సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు ప్రఖర్ జైన్ పాల్గొన్నారు.


