Homeవ్యాపారంపశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఎల్‌నినో ముప్పుతో మార్కెట్‌ల అస్థిరత' పిఎల్ క్యాపిటల్

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఎల్‌నినో ముప్పుతో మార్కెట్‌ల అస్థిరత’ పిఎల్ క్యాపిటల్

- Advertisement -

ముంబై : పిఎల్ క్యాపిటల్, భారతదేశంలోని ప్రముఖ, విశ్వసనీయ ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటి, “వెస్ట్ ఏషియా కైసిస్, ఎల్ నినో కెన్ ప్లే ఏ స్పాయిల్ స్పోరట్” శీర్షికతో విడుదల చేసిన తాజా ఇండియా స్ట్రాటజీ రిపోర్ట్‌లో, భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక నిర్మాణాత్మక వృద్ధి బలంగా కొనసాగుతున్నప్పటికీ, స్వల్పకాలంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాతావరణ సంబంధిత అంతరాయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల వంటి సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్‌లో మెరుగుదల, ముడి చమురు ధరల తగ్గుదల, ఆకర్షణీయమైన మార్కెట్ విలువలు భారత ఈక్విటీ మార్కెట్‌కు బలమైన మద్దతునిస్తూనే ఉంటాయని నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, పశ్చిమాసియాలో తాత్కాలిక కాల్పుల విరమణ, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ట పనితీరు కారణంగా గత రెండు నెలల్లో నిఫ్టీ సూచీ సుమారు 7.3 శాతం పెరిగింది. అలాగే, 52 వారాల కనిష్ట స్థాయి నుంచి దాదాపు 8 శాతం రికవరీని నమోదు చేసింది. రుణాల వృద్ధి17%కు చేరుకోవడం, రిటైల్, సేవలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో బలమైన రుణ డిమాండ్ కొనసాగుతున్నట్లు సూచిస్తోంది. ఇదే సమయంలో, ప్రపంచ సరఫరా గొలుసు, వస్తువుల ధరల్లో ఏర్పడిన అంతరాయాల ప్రభావాన్ని తగ్గించడంలో భారత ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థను కాపాడాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు