సీమాంతర ఉగ్రవాదం`దాడులను సహించం
. అఫ్గాన్ల సహనాన్ని, ధైర్యాన్ని పరీక్షించాలనుకోవద్దు
. ఏకపక్షంగా సంధి జరగదు
. భారత గడ్డపై తాలిబన్ మంత్రి వ్యాఖ్యలు
న్యూదిల్లీ: అఫ్గాన్ ప్రజల ధైర్యాన్ని, సహనాన్ని పరీక్షించొద్దని, రెచ్చగొట్టవద్దని పాకిస్థాన్‌కు తాలిబన్ మంత్రి ముత్తాఖీ హెచ్చరిక చేశారు. సీమాంతర ఉగ్రవాదం`దాడులను సహించబోమని తేల్చిచెప్పారు. అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో హెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) శిబిరాలు లక్ష్యంగా సరిహద్దు వద్ద మారుమూల ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులను ఖండిరచారు. పాకిస్థాన్ తప్పు చేసిందని, ఇలాంటి వైఖరితో సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని అన్నారు. అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ తొలిసారి భారత్‌లో అధికారికంగా పర్యటించారు. ఆయన శుక్రవారం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో న్యూదిల్లీలో భేటీ అయ్యారు. తమ భూభాగాన్ని ఇతర ఏ దేశం కూడా వినియోగించుకునేందుకు వీలు కల్పించబోమని హామీనిచ్చారు. అదే సమయంలో భారత్ గడ్డపై నుంచి పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. ‘అఫ్గాన్ ప్రజల సహనాన్ని, ధైర్యాన్ని పరీక్షించాలని అనుకోవద్దు. అలాంటి ఆలోచన ఉంటే బ్రిటిష్, సోవియట్, అమెరికా, నాటో నేర్పిన చారిత్రక పాఠాలు గుర్తుచేసుకోవాలి. శాంతి మార్గాన్ని అనుసరించాలి’ అని పాకిస్థాన్‌నుద్దేశించి ముత్తాఖీ అన్నారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలు గతంలో అఫ్గాన్ నుంచి పనిచేశాయి కానీ గత నాలుగేళ్లలో వాటిని తుడిపెట్టేసినట్లు తెలిపారు. తమ గడ్డపై ఒక్క ఉగ్రవాది కూడా లేడని, అంగుళం భూమి కూడా వారి అధీనంలో లేదని చెప్పారు. 40 ఏళ్ల తర్వాత అఫ్గాన్‌లో శాంతిపురోగతి కనిపిస్తున్నట్లు తెలిపారు. అఫ్గాన్ల ధైర్యాన్ని పరీక్షిస్తే ఏమవుతుందో సోవియన్ యూనియన్, అమెరికా, నాటోను అడిగితే తెలుస్తుందని, అఫ్గాన్ జోలికి రావద్దని పాకిస్థాన్‌కు ముత్తాఖీ తేల్చిచెప్పారు. ప్రాంతీయ సుస్థిరతకు అఫ్గాన్ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇస్లామాబాద్‌తో మెరుగైన సంబంధాలను కాబుల్ కోరుకుంటున్నాగానీ అది ఏకపక్షంగా జరగదని ముత్తాఖీ అన్నారు. సీమాంతర దాడులతో అఫ్గాన్‌పాక్ మధ్య ఉద్రిక్తతల క్రమంలో భారత్‌తో సంబంధాలకు అవకాశం లభించింది. అఫ్గాన్ ప్రజలకు భారత్ శ్రేయోభిలాషి అని, ఇటీవల భూకంపం వచ్చినప్పుడు ముందుగా స్పందించినది న్యూదిల్లీ అని ముత్తాఖీ ప్రశంసించారు. భారత్‌ను మిత్రదేశంగా అఫ్గాన్ పరిగణిస్తుందన్నారు. పరస్పరం స్నేహంగౌరవంవాణిజ్యం కోరుకుంటున్నట్లు వెల్లడిరచారు. తమ సంబంధాలను పెంచుకోవడం కోసం సంప్రదింపుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని చెప్పారు. అమెరికా సుంకాలను ముత్తాఖీ ప్రస్తావించారు. ఆ దేశంతో భారత్, అఫ్గాన్ ఉమ్మడిగా చర్చలు జరపడం అవసరమన్నారు. వాణిజ్యానికి ఉన్న ప్రాధాన్యత తెలుసని, అన్ని వాణిజ్య మార్గాలు తెరుచుకోవాలని, ఏది మూసుకున్నా భారత్`అఫ్గాన్ వాణిజ్యంపై ప్రభావం ఉంటుందన్నారు. కీలక సమయాల్లో భారత్ తమకు సహకారాన్ని అందించిందని ముత్తాఖీ వెల్లడిరచారు. రెండు దేశాల మధ్య మరింతగా అవగాహన పెంచుకునే చర్యలకు సిద్ధమన్నారు.


