హైదరాబాద్‌ః బ్యూటీ అండ్ వెల్నెస్ పరిశ్రమలో ప్రముఖ పేరు అయిన పింక్స్ ఎన్ బ్లూస్, చిన్న, నాన్-బ్రాండెడ్ సెలూన్లను శక్తివంతం చేయడం, నయీ బ్రాహ్మణ సమాజ వారసత్వాన్ని కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్న తన విప్లవాత్మక ‘‘పోనీ సెలూన్స్ కన్వర్షన్’’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. 20 సంవత్సరాల క్రితం సీతా దేవి స్థాపించిన పింక్స్ ఎన్ బ్లూస్, స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభమైంది. ఒకే విశ్వసనీయ బ్రాండ్ కింద ప్రొఫెషనల్, పరిశుభ్రమైన, అధిక-నాణ్యత సేవలను అందించడం ద్వారా అందం, వెల్నెస్ అనుభవాన్ని పునర్నిర్వచించడం. సంవత్సరాలుగా, ఇది నమ్మకం, శ్రేష్ఠతకు చిహ్నంగా ఎదిగింది, దాని కస్టమర్-ఫస్ట్ ఫిలాసఫీకి కట్టుబడి ఉంది. ఈ మిషన్‌కు అనుగుణంగా, పింక్స్ ఎన్ బ్లూస్ యూనిట్ అయిన పోనీ సెలూన్స్, సామాన్యులకు సరసమైన, నాణ్యమైన గ్రూమింగ్ సేవలను శుభ్రమైన, ప్రొఫెషనల్ వాతావరణంలో అందించడానికి ప్రారంభించబడిరది. తాజాగా, సీతా దేవి మేడమ్ పోనీ సెలూన్స్ కన్వర్షన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా మరో దార్శనిక అడుగు వేసింది.


