ఇకే రోమే
సమస్త మానవాళికి, ముఖ్యంగా ప్రపంచలోని మాతమూర్తులకు, సరిహద్దులు లేని వైద్యులకు, ఆత్మగౌరవం ఉన్న జర్నలిస్టులకు, ఇప్పటికీ న్యాయం కోరుకునే ప్రభుత్వాలకు వారు చూడకూడదనుకునే నేరాన్ని నేను ఖండిస్తున్నాను. నా పేరు లక్షలాది మంది ఇతరుల మాదిరిగానే ఉంది. ప్రసిద్ధమైన ఇంటి పేరు లేదు, ప్రముఖమైన పదవి లేదు. నేను ఒక సాధారణ క్యూబన్ బాలికను. ఒక కుమార్తె, సోదరి, దేశభక్తురాలిని. నేను ముక్కలైన హృదయంతో, వణుకుతున్న చేతులతో ఈ లేఖను రాస్తున్నాను. ఈ రోజు నా క్యూబన్ ప్రజలు ఎదుర్కొంటున్నది సంక్షోభం కాదు. నెమ్మదిగా క్యూబా ప్రజలను అమెరికా చేస్తున్న హత్య, వాషింగ్టన్ నుంచి అమలుచేస్తున్న మారణకాండ. క్యూబాకు సరుకును విక్రయించే కంపెనీలకు జరిమానా విధించడం ఉద్దేశపూర్వకమైనది. క్యూబాలో వద్ధులకు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహానికి వాడే మందులను దూరంగా ఉంచి ఉద్దేశపూర్వక నిషేధం విధించి హింసిస్తే ప్రపంచంలోని ప్రభుత్వాలు మౌనంగా ఉంటాయేమో కానీ ఒక క్యూబన్ తాత తన ఛాతీని చీల్చి పట్టుకుని ఎంతటి సమరానికైనా వేచి ఉంటాడు. మరణానికి ఏమీ భయపడడు. తమ గడ్డ మీద అమెరికా కాలు మోపితే, తమ పై ఆంక్షలు విధిస్తే సహించేది లేదని ప్రాణాలు విడవడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇంధనం లేనందున క్యూబాలోని ఇంక్యుబేటర్లను ఆపివేయాల్సి వచ్చింది. నవజాత శిశువులు తమ ప్రాణాల కోసం పోరాడుతున్నారు అయితే అమెరికా ప్రభుత్వం ఏ దేశాలు మనకు చమురు అమ్మాలో, ఎవరకి అమ్మకూడదో నిర్ణయించింది. ఏ దేశం క్యూబాకు చమురు అమ్మకూడదని నిర్ణయించింది. దీనిపై వాషింగ్టన్‌లోని ఒక కార్యాలయంలో చేసిన సంతకం అమెరికా నుంచి 90 మైళ్ల దూరంలో ఉన్న శిశువు ఏడుపు కంటే విలువైనదని వారి అభిప్రాయం. దీనినంతటినీ గమనిస్తున్న అంతర్జాతీయ సమాజం ఎక్కడ ఉంది? పిల్లలను రక్షించే సంస్థలు ఎక్కడ ఉన్నాయి? క్యూబాలో తనలాంటి చిన్నారులు జీవించడానికి అర్హులు కాదని భావిస్తున్నారా? క్యూబాపై అమెరికా ప్రభుత్వ నిరంకుశ విధానాలు 60 సంవత్సరాలుగా చెలాయిస్తున్నారు. ట్రంప్ హయాంలో మరింత దిగజారింది. ఇది మార్కో రూబియో హయాంలో క్రూరంగా అమలుచేశారు. ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో నలిగిపోతున్న తరుణంలో ప్రాణాలను కాపాడిన క్యూబా వైద్యులకు నేడు సిరంజిలు, అనస్థీషియా, ఎక్స్-రే పరికరాలు లేవు. వాటిని ఎలా ఉత్పత్తి చేయాలో తెలియకపోవడం వల్ల కాదు. మా దగ్గర ప్రతిభ లేకపోవడం వల్ల కాదు. దిగ్బంధనం కారణంగా, మాకు సామాగ్రి, విడిభాగాలు, సాంకేతికత అందుబాటులో లేవు. క్యూబా శాస్త్రవేత్తలు కరోనాకు వ్యతిరేకంగా ఐదు వ్యాక్సిన్‌లను సృష్టించారు. ఐదు! ఎవరి సహాయం లేకుండా. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా. దిగ్బంధనాలకు వ్యతిరేకంగా. క్యూబా మిమ్మల్ని కరపత్రాలు అడగదు, సైనికులను అడగదు, మమ్మల్ని ప్రేమించమని అడగదు. క్యూబా మిమ్మల్ని న్యాయం కోసం అడుగుతుంది, నా ప్రజల బాధలను ఆపమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దిగ్బంధన పేరుతో మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు. మాకు దాతృత్వం అక్కర్లేదు. మమ్మల్ని బతకనివ్వమని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. చరిత్ర మిమ్మల్ని మూల్యం చెల్లించేలా చేస్తుంది. ఆంక్షలపై సంతకం చేసే వారిని క్యూబన్లుగా మర్చిపోము, క్షమించము. మా హృదయాలలో ఇప్పటికీ మానవత్వం పట్ల గౌరవం ఉంది. క్యూబాను చూడండి. వారు మనకు ఏమి చేస్తున్నారో చూడండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి : “మీరు చరిత్రకు ఏ వైపు ఉండాలనుకుంటున్నారు?” ఈ చిన్న ద్వీపంలోని ప్రజలు నిరంకుశ ప్రభుత్వాలకు లొంగిపోని ఒక సాధారణ క్యూబన్ మహిళ మాటలు మీ హృదయాలను కలిచివేస్తే వాటిని దాటండి. మీకు 10 మంది స్నేహితులు లేదా 10,000 మంది అనుచరులు ఉన్నా, మీ బారికేడ్ పబ్లిక్ లేదా ప్రైవేట్ అయినా, మీరు ఎప్పుడూ ఏమీ పంచుకోకపోయినా తేడా లేదు. క్యూబన్ ప్రజల కేకలు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండవు. అవి వినబడతాయి. అవి ఖండాలు దాటతాయి. అవి గుంపుగా మారుతాయి. మరో క్యూబన్ విప్లవానికి సిద్ధమవుతాం…నేను ఈరోజు మిమ్మల్ని “లైక” కోసం అడగడం లేదు. షేర్ చేయండి, తద్వారా ప్రతి దేశంలోని తల్లులు క్యూబా ఇంక్యుబేటర్లలో తమ ప్రాణాల కోసం పోరాడుతున్న పిల్లలు ఉన్నారని తెలుసుకుంటారు. తద్వారా సామాజ్య్రవాద దేశాల ప్రభుత్వాలు సిగ్గుపడతాయి. అబద్ధాల మీడియా తప్పించుకోలేవు.అయితే మేము మౌనంగా ఉండము.దీన్ని పంచుకునే ప్రతి వ్యక్తి ప్రపంచాన్ని మార్చగలడు. వేలు, మిలియన్లు, అవును! ఈ మాటలను మీలోనే ఉంచుకోకండి. మౌనంగా ఉండకండి. ఈ ఖండనను పంపండి అందరికీ ఇప్పుడే షేర్ చేయండి!
( ఇకే రోమే ఒక క్యూబన్ నటి, మైటే (1994), గ్వాంటనామెరా (1995), ది యూజ్‌లెస్ డెత్ ఆఫ్ మై పాల్, మనోలో (1989) వంటి చిత్రాలలో ఆమె పాత్రలకు పేరుగాంచింది. )
స్వేచ్ఛానువాదం : ఈడుపుగంటి రోమిల
(ఐడీ కమ్యూనిజం నుంచి)


