డాక్టర్ అరుణ్ మిత్ర
తాజాగా బ్రెజిల్‌లోని రియో డిజనైరోలో ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం అనేక ముఖ్యమైన పరిణామాలు వెలువరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ శిఖరాగ్ర సమావేశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి – ఈ సమావేశం అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని అంతం చేయడానికి కుట్రగా అభివర్ణించారు. అంతేకాకుండా, బ్రిక్స్ సభ్య దేశాలపై 10శాతం సుంకం విధిస్తానని చిందులు తొక్కారు. ఆగస్టు 1 నుంచి విధిస్తానని ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య బ్రిక్స్ సమావేశం కేవలం ప్రపంచ సమస్యలు, దేశాల మధ్య వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాలేదు, దేశాల మధ్య వాణిజ్యాన్ని నియంత్రించడానికి అమెరికా కుయుక్తులు, పన్నాగం, దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధాలకు అమెరికా చేపట్టిన యుద్ధతంత్రాల ప్రస్తుత తరుణంలో బ్రిక్స్ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. అమెరికా వైమానిక క్షిపణి రక్షణ వ్యవస్థ మరిన్ని ఆయుధాలను అందిస్తోంది. జర్మనీని కూడా ఆయుధాలను అందించమని కోరుతోంది. ఆయుధాలను విక్రయించడం ద్వారా లాభం సంపాదించడానికి, యుద్ధ ఉత్పత్తులను మరింత పెంచడానికి యుద్ధాన్ని పొడిగించడానికి అమెరికా ఆయుధ పరిశ్రమ కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో నాటో దేశాలు తమ రక్షణ వ్యయాన్ని జీడీపీిలో 2% నుంచి 5%కి పెంచాలని నిర్ణయించాయి.
రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడం ఖండిరచదగ్గదే అయినప్పటికీ, నాటో విస్తరణ విధానాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఉక్రెయిన్‌ను నాటోలో చేరాలని పదేపదే అమెరికా కోరింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దాడిని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథó్యంలో స్వీడన్, నార్వేలను కూడా నాటోలో చేర్చారు. మరోవైపు, గాజాలో ఇజ్రాయిల్ ప్రభుత్వం చేస్తున్న మారణహోమం అత్యంత అమానవీయ చర్యలలో ఒకటి. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ, అమెరికా అండంతో ఇజ్రాయిల్ అమానవీయ పద్ధతిలో పలస్తీనాపై బాంబుల వర్షాన్ని కొనసాగిస్తోంది. దీనిని అమెరికా సమర్ధించడమే కాకుండా ఇజ్రాయిల్‌్‌కు బాంబులను కూడా భారీ ఎత్తులో సరఫరా చేస్తోంది. పేట్రేగుతున్న ఇజ్రాయిల్ మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలలో తన దాడులు కొనసాగిస్తోంది. అమెరికా, యూరోపియన్ దేశాలు తాజాగా సిరియాలో ఒకప్పుడు ఉగ్రవాదులుగా ముద్ర వేసిన వారికి భారీగా సహకరిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్`పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం కేవలం నాలుగు రోజులు మాత్రమే కొనసాగింది – అయితే సామ్రాజ్యవాద దేశాల జోక్యంతో ఆజ్యం పోసినట్లుగా దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అనేక ఆఫ్రికన్ దేశాలు సామ్రాజ్యవాద దేశాల ప్రోత్సాహంతో అంతర్గత యుద్ధాల్లో కూరుకుపోయాయి. సూడాన్‌లో 150,000 మందికి పైగా మరణించారు. ఆఫ్రికన్ దేశాలను అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని ట్రంప్ ఆదేశించడంతో ఆధునిక సాంకేతికతకు అవసరమైన మూలకాలు ఆఫ్రికాలో సమృద్ధిగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికా దేశాలపై కన్నుపడిరది.
తాజాగా దక్షిణ అమెరికాలో, అమెరికా పనామా కాలువను తన దేశంలో కలుపుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసి ట్రంప్ ప్రభుత్వం విఫలమైంది. మెక్సికో గల్ఫ్ పేరును మార్చాలని, గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా యత్నించింది. భౌగోళిక, రాజకీయ ప్రయోజనం కోసం సామ్రాజ్యవాద దేశాలు అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాలలో అస్థిరతకు ఆజ్యం పోయడం తెలిసిందే.. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం 2023లో 2,443 బిలియన్లకు చేరుకుంది. ఇది మునుపటి సంవత్సరం కంటే 6.8శాతం ఎక్కువ. అలీన ఉద్యమం పేరుతో అభివృద్ధి చెందుతున్న దేశాలు పెత్తనం చేస్తున్న సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. అయితే భారతదేశం ఆ ఉద్యమాన్ని బలహీనపరచడంతోపాటు సార్క్‌ను కూడా విస్మరించింది. అయితే ఒకప్పుడు సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన దేశాలు ప్రస్తుతం క్రియారహితంగా ఉన్నాయి. బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ శాంతి, పరస్పర వాణిజ్యం, గాజాపై ఇజ్రాయిల్ దాడిని ప్రపంచదేశాలు ముక్తకంఠంతో ఖండిరచాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై చర్చలు జరిగాయి.. ప్రపంచాన్ని కబళిస్తున్న ఉగ్రవాదాన్ని సభ్యదేశాలు తిరస్కరించాయి. ఈ సమావేశంలో ఉమ్మడి బ్రిక్స్ కరెన్సీ కోసం, స్థానిక కరెన్సీలలో వాణిజ్యంకోసం ప్రతిపాదనలు చేశారు. అణు ముప్పుప్రమాదంపై బ్రిక్స్ ప్రకటనలోని 38వ నిబంధన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశాల మధ్య నిరాయుధీకరణ పునరుద్ధరణ, ప్రపంచ శాంతి, భద్రత కోసం బ్రిక్స్ పిలుపునిచ్చింది. అణ్వాయుధాలు లేని ప్రపంచంకోసం నొక్కి చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో, బ్రిక్స్ క్రియాశీల పాత్రను పోషించనుంది. ఇది సామ్రాజ్యవాదాన్నిపూర్తి స్థాయిలో ఖండిస్తోంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా చెప్పినట్లుగా, ‘‘అమెరికా ప్రపంచానికి చక్రవర్తి కావాలని కోరుకుంటుంది, కానీ చక్రవర్తుల కాలానికి కాలం చెల్లిందనేది గుర్తించాలని వ్యాఖ్యానించారు.
భారత్ బ్రిక్స్‌లో మరింత చురుకైన పాత్ర పోషించాల్సి సమయం ఆసన్నమైంది. తదుపరి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం భారత్‌లోనే జరగాల్సి ఉంది. దానికి సంబంధించిన ప్రణాళిక తక్షణం ప్రారంభించాలి. జి7, క్వాడ్ వంటి వాటిల్లో భారత్‌కు ప్రత్యేక స్థానం లేదు, బ్రిక్స్‌లో భారత్ బలమైన కఠినవైఖరిని తీసుకుంటే, ప్రపంచ స్థాయిని మరింత బలోపేతం చేయగలదు. బ్రిక్స్ శాంతిని, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలను డిమాండ్ చేస్తే, వీటో వ్యవస్థ ముగింపు కోసం భారతదేశం ఈ సమస్యలను బిగ్గరగా లేవనెత్తితే, మార్పు సాధ్యమే. భారతదేశం కూడా అలీన ఉద్యమాన్ని పునరుద్ధరించడానికి మరింతగా కృషి చేయాల్సి ఉంది.
ఇజ్రాయిల్‌కు భారత్ ఇటీవల ఇచ్చిన మద్దతు ప్రపంచవ్యాప్తంగా దాని ప్రతిష్టను బలహీనపరిచింది. భారత ప్రభుత్వం దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెట్టకుండా, కేవలం తాత్కాలికమైన ఎన్నికల ప్రయోజనాలకోసం విదేశాంగ విధానాన్ని తాకట్టుపెట్టడం అత్యంత గర్హనీయం.. ఏకథృవ ప్రపంచంకంటే బహుళధృవ ప్రపంచంవైపు దృష్టిసారిన్తే మన ప్రతిష్టను మనం మరింతగా కాపాడుకోవచ్చు. నిరంతర యుద్ధాలు, అణ్వాయుధాల ముప్పు పెరుగుతున్న తరుణంలో భారత్ ఇజ్రాయిల్ వంటి దేశాలకు దూరంగా ఉంటూ, ఇరాన్ వంటి దీర్ఘకాల మిత్రదేశాలతో తిరిగి సంబంధాలు ఏర్పరచుకోవాల్సి ఉంది. దక్షిణాసియా దేశాలతో శాంతియుత భావనను పెంపొందించుకోవాలి. రాజకీయ సంకల్పం, దూరదృష్ట్టి దృష్ట్యా ఈ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే అవకాశం, సామర్థ్యం భారత్‌కు ఉంది.


