ఏసీపీ దుర్గారావు
విశాలాంధ్ర`విజయవాడ (క్రైం): ప్రశాంతంగా వినాయక చవితి పండుగ జరుపుకునేందుకు పది సూత్రాలు పాటించాలని విజయవాడ పశ్చిమ ఏసీపీ దుర్గారావు అన్నారు. మంగళవారం విజయవాడ చిట్టినగర్ నగరాల కళ్యాణమండపంలో వినాయక చవితి మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీపీ దుర్గారావు మాట్లాడుతూ …
1) వినాయక చవితి పండుగను ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో, విశేషంగా జరపుకుంటారని, పండుగ కార్యక్రమాలు సాఫిగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారనాఉ. మండపాలు విషయంలో కనీసం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి వారి వివరాలు పోలీస్ స్టేషలో నమోదు చేసుకోవాలన్నారు. ప్రవైట్ స్ధలం అయితే యజమాని, ప్రభుత్వం స్ధలం అయితే మున్సిపాలిటి, పంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రాత్రి పగలు కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలని చెప్పారు.
2) భద్రతా చర్యలు, ఫైర్, మున్సిపాల్, విద్యుత్ శాఖల అనుమతి, మండపాల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా ఇసుక, నీరు సిద్దంగా ఉంచాలి, రాత్రి సమయంలో కమిటీ సభ్యులు కాపలాగా ఉండాలన్నారు.
3) విగ్రహ నిమజ్ఞనం, ఎత్తు, బరువు, తేదీ, సమయం, వాహనా వివరాలను ముందుగానే పోలీస్ వారికి తెలియజేయాలి, లైసెన్స్ ఉన్న డ్రైవర్లనే నియమించాలి,
4) శబ్ధ కాలుష్యం, లౌడ్ స్పీకర్లు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు వాడరాదన్నారు.
5) ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా ముందుగా పోలీస్ వారికి మార్గం తెలియజేయాలి, అవసరమైతే రూట్ మార్చుకోవాలి,
6) మండపాల వద్ద, ఊరేగింపు సమయంలో అసభ్య నృత్యాలు, డీజేలు, మత్తుపదార్ధాలు వాడకం అనుమతిలేదు.
7) 11వ రోజుతో ఎట్టి పరిస్ధితుల్లో నిమజ్ఞనాలు పూర్తి చేయాలి
8) మండపాలు వల్ల చట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, మండపం దగ్గర ఉండే ఇతర మతస్తుల ప్రార్ధనా సమయంలో వారికి ఆటంకం కలిగించకూడదన్నారు.
9) దేవుడికి విలువైన బంగారు, వెండీ వస్తువులు అలంకరించకూడదని, ఒక వేళ ఆలంకరిస్తే పూజ ఆనంతరం తీసి ఇంట్లో భద్రపరుచుకోవాలన్నారు.
10) మండపంలో నిఘా ఉండేట్లు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తద్వారా మండపం వద్ద ఇటువంటి దొంగతనాలు జరగకుండా నివారించవచ్చన్నారు. పోలీస్ నిబంధనలు పాటించి, ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ కొండలరావు, ఎస్త్సె పద్మారావు, ట్రైనింగ్ ఎస్త్సెలు ఎస్.నాయుడు, చక్రధర్ పాల్గొన్నారు.


