18 మంది మృతి హిమాచల్లో ఘటన
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని బలాస్పూర్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడి ప్రైవేటు బస్సుపై పడ్డాయి. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రaాందత్తా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భాలుఘాట్లో మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 35 మంది వరకు ఉన్నట్లు వెల్లడిరచారు. హర్యానాలోని రొహతక్ నుంచి ఘోమర్విన్కు వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగిందన్నారు. పోలీసులు, జిల్లా అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు వెల్లడిరచారు. శిథిలాల కింద నుంచి 18 మృతదేహాలు వెలికి తీసినట్లు చెప్పారు. కొండ మొత్తం విరిగిపడిరదని, ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంటుందని సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అన్నారు. ఈ ఘటనపై సీఎం సుఖ్విందర్ సింగ్ సుకూ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని, సాధ్యమైనంత ఎక్కువ మందిని కాపాడేందుకు ప్రయత్నించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన పేర్కొంది. కాగా, సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడిరచారు.


