Homeతెలంగాణసకాలంలో పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తి

సకాలంలో పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తి

- Advertisement -

. సాంకేతిక పారదర్శకత, సంస్థాగత జవాబుదారీతనంతో పనులు
. ఎన్‌డీఎస్‌ఏ నివేదికల ప్రకారమే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ
. మంత్రి ఉత్తమ్‌

విశాలాంధ్ర-హైదరాబాద్‌: పెండిరగ్‌ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. సాంకేతిక పారదర్శకత, సంస్థాగత జవాబుదారీతనంతో పనులు జరగాలన్నారు. డాక్టర్‌ బీఆర్‌ తెలంగాణ సచివాల యంలో మంగళవారం సీనియర్‌ అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం విలేకరులతో ఉత్తమ్‌ మాట్లాడారు. ప్రాణహితచేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టు, శ్రీకాకుళం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నల్‌... కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సందిల్లా బ్యారేజీల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మడిహట్టి భాగాన్ని మొదటి అంశంగా తీసుకుంటూ, ఇంజనీరింగ్‌ బృందాలు రెండు ప్రత్యామ్నాయ కాలువ మార్గాలను పరిశీలిస్తున్నాయని చెప్పారు. ఈనెల 22వ తేదీకి తుది నిర్ణయం జరుగుతుందని ఉత్తమ్‌ అన్నారు. ఎస్‌ఎల్‌బీసీని 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రతి 15 రోజులకు సమీక్షలు, సాంకేతికాధారిత సర్వేలతో భద్రత, నాణ్యతకు హామీనిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మెడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణ ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం జరుగుతోందన్నారు. ‘ప్రధాన ఐఐటీ బృందం నిర్మాణ రూపకల్పన, పరీక్షలు, పునరుద్ధరణ ప్రణాళికను చేపడుతుంది. వర్షాకాలానికి ముందు పరీక్షలు పూర్తయ్యాయి. పునరుద్ధరణ రూపకల్పన ఏడాదిలో జరుగుతుంది’ అని ఉత్తమ్‌ తెలిపారు. పునరు ద్ధరణ ప్రక్రియ ఎన్‌డీఎస్‌ఏ సిఫారసులకు అనుగుణంగా ఉంటుందన్నారు. బ్యారేజీల భద్రత అత్యంత ప్రాధాన్య మని, ప్రతి దశలో జాతీయ స్థాయి సంస్థలు పాల్గొంటూ శాస్త్రీయ, పారదర్శక, సవరణాత్మక విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. న్యాయ అంశాల పరంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ విచారణల పురోగతిని మంత్రి సమీక్షించారు. ప్రతి సమావేశానికి సంబంధించిన సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని, దిల్లీలోని న్యాయ బృందంతోసుప్రీంకోర్టులో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే న్యాయవాదులతో సమన్వయం, వాదనల్లో ఏకరూపత ఉండాలని అధికారులను ఉత్తమ్‌ ఆదేశించారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్టు కోసం కేంద్ర జల కమిషన్‌ (సీడబ్ల్యూసీ)ను సంప్రదించి నీటి కేటాయింపు టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఆమోదం కోరినట్లు తెలిపారు. దేవదుల ప్రాజెక్టు శాఖ ప్రధాన ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ఒకటని, భూ సేకరణ పరిహారంగా రూ.33 కోట్లు విడుదల చేయాలని ఆదేశించి, అంచనాలను (ఆర్‌ఈలు) ఈ నెలలో ఆమోదించాలని సూచించారు. డిరడి ప్రాజెక్టుపై సమగ్ర సమీక్షా నివేదిక సిద్ధం చేయాలని, భౌతిక పురోగతి, నిధుల వినియోగం, పెండిరగ్‌ పనుల గురించి నివేదిక మూడు రోజులలో సమర్పించాలన్నారు. నీటి పారుదల రిజర్వాయర్ల మట్టిని తొలగించడం, రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచే స్వయం సమర్థ విధానాన్ని రూపొందించడం పైనా సమీక్షించారు. అదనపు ఇంజనీర్ల నియామకం, హార్డ్‌వేర్‌ అప్‌గ్రేడ్‌, ఆధునిక రూపకల్పన సాఫ్ట్‌వేర్‌ వినియో గం, అన్ని ప్రధాన రిజర్వాయర్లు నిండుగా ఉంచాలని, హైడ్రాలజికల్‌ సీజన్‌ ముగిసే వరకు టెలీమెట్రీ ఆధారిత పర్య వేక్షణ కొనసాగించాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు