ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం సత్తా చాటింది. ఔరంగాబాద్, ముంబై, నాగ్‌పూర్ వంటి నగరాల్లో సంచలన విజయాలు నమోదు చేసింది. మొత్తం 125 మంది కార్పొరేటర్లుగా ఎన్నిక కావడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తంచేశారు. మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటివరకు తమ పార్టీని బీజేపీకి బీ టీమ్‌గా విమర్శించిన వారు ఇకపై ఆ వ్యాఖ్య చేయగలరా అంటూ సవాల్ విసిరారు. ఓడిపోయిన పార్టీలు ఆత్మపరిశీలిన చేసుకోవాలన్నారు. ఒవైసీ శనివారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు పేర్ల ఇవ్వాలని తమ పార్టీ కోరిందన్నారు. విజయానికి చాలా కారణాలు ఉంటాయని, ఓటమికి ఉండవన్నారు. తమ గెలుపుకు, ఇతరుల ఓటమికి కారణాలు వారే (ప్రత్యర్థులే) చెప్పాలని వ్యాఖ్యానించారు. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్‌ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేల కలయిక గురించి అడిగిన ప్రశ్నకు… ఫలితాలు అందరి ముందే ఉన్నాయని, ఏక్‌నాథ్ శిందే ఇల్లున్న ప్రాంతంలో ఉద్ధవ్ పార్టీ అభ్యర్థి గెలిచారని ఒవైసీ బదులిచ్చారు. తమ పార్టీ గెలిచిందనే ఆనందంలో ఉన్న తనకు ఇతరుల గురించి తెలియదని చెప్పారు. పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్థులు పార్టీతోనే ఉంటారని, కార్పొరేటర్లను ఏకతాటిపై ఉంచడానికి ముందుజాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడిరచారు.
బీజేపీకి బీ`టీమ్ అనగలరా: ఒవైసీ
- Advertisement -
RELATED ARTICLES


