Friday, May 9, 2025
Homeభూమ్మీదకు సునీతా విలియమ్స్‌

భూమ్మీదకు సునీతా విలియమ్స్‌

షెడ్యూల్‌ ఖరారు
వాషింగ్టన్‌: దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. మరికొన్ని గంటల్లో వారి తిరుగుపయనం ప్రారంభం కానుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 3 గంటలకు) వారు భూమ్మీద ల్యాండ్‌ అవనున్నారు. ఈ మేరకు నాసా ప్రకటించింది. సునీత, విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ ఆదివారం విజయవం తంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధాన మైంది. క్రూ-10 మిషన్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక హ్యాచ్‌ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.45 గంటలకు మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక అన్‌డాకింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ స్పేస్‌షిప్‌ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. మంగళవారం సాయంత్రం 5.11 గంటలకు భూకక్ష్యలను దాటుకుని కిందకు వస్తుంది. అదే రోజు సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్‌ క్యాప్సూల్‌ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడిరచింది.
ప్రత్యక్ష ప్రసారం
ఈ ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీనిని నాసాలో భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 గంటల నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే నాసాకు సంబంధించిన సోషల్‌ మీడియా వేదికల్లో కూడా ప్రసారం కానుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు