Wednesday, February 18, 2026
Homeసాహిత్యంమట్టి-మనిషి

మట్టి-మనిషి

- Advertisement -

మనిషితో బంధం కన్నా
మట్టితో బంధం మిన్న
మగని కట్టే తాళి కన్నా
మాగాణికి కట్టే కంచె మిన్న
మాతృత్వంలో మాధుర్యం కన్నా
మట్టిలో మొలిచే విత్తు మిన్న
మాస్టారు నేర్పిన రాత కన్నా
మట్టిలో రాసిన నాగలి రాత మిన్న
మనిషిని నమ్మి మోసపోవడం కన్నా
మట్టిని నమ్మి మేల్కొవడం మిన్న
మనిషి కోరే ధన మూటలు కన్నా
మడిలో పండే ధాన్య మూటలు మిన్న
మనిషికి అక్షరజ్ఞానం కన్నా
మట్టి అందించే అన్నం విత్తు మిన్న
మనిషి మేధస్సుతో అభివృద్ధి అబద్దం.
అది అతని సౌకర్యంకోసం శ్రమించే స్వార్థం
మానవ లోకంలో సకల జీవరాశులకు
కడుపు నింపేది మట్టి మనిషే……
మనిషి కనుగొన్న యంత్రంలో
మనిషి యాంత్రికుడుగా మారి కనుమరుగయ్యేడెమో……???
మట్టినినమ్మే మనిషిమాత్రం
మట్టి కొట్టుకుపోలేదు
మట్టిలో మాణిక్యం అయ్యాడు.
మనిషిని కన్న అమ్మ కన్నా
మొక్కను కన్న అమ్మ మిన్న
మనిషి జీవనం మట్టితో….
మనిషి మరణంతో మట్టి గర్భంలో….
మనిషి మరణం తరువాత
ఒడి చేరే ఈ అమ్మే మిన్న….. ??
డా. జి. మాలతి,
9490824860

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు