గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 కోసం తాము అపూర్వమైన డిమాండ్‌ను అందుకున్నట్లు వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ ‘అవుట్-ఆఫ్-స్టాక్’గా ఉంది. అపూర్వమైన ఈ డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ నోయిడాలోని దాని తయారీ కర్మాగారంలో అవసరమైన చర్యలు తీసుకుంటోంది. సామ్‌సంగ్ ఇండియా, ఇంతకుముందు తమ ఏడవ తరం ఫోల్డబుల్స్ – గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7ఎఫ్‌ఈ – కోసం భారతదేశంలో కేవలం 48 గంటల్లో రికార్డు స్థాయిలో 210,000 ప్రీ-ఆర్డర్‌లను అందుకున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశంలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్, వేగవంతంగా ప్రధాన స్రవంతిలోకి రావడాన్ని సూచిస్తుంది. ‘‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్7కు రిటైల్ మార్కెట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి బలమైన డిమాండ్ వస్తోందని సామ్‌సంగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ అన్నారు.


