హైదరాబాద్: పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ చిత్రం మార్చి 26న ఈ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘గబ్బర్ సింగ’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉంటుందని దర్శకుడు హరీశ్ శంకర్ ఇప్పటికే వివిధ ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో పొలిటికల్ డైలాగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని సినీ వర్గాల సమాచారం. మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుండటంతో సినిమాకు లాంగ్ వీకెండ్, సమ్మర్ హాలిడేస్ కలిసిరానున్నాయి. ఇటీవల ఓజీతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్… మరోసారి వెండితెరపై తన మార్క్ మాస్ ఎంటర్‌టైనర్ చేయడం పక్కా అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… ఇప్పటికే వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లు నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.


