Sunday, December 7, 2025
Homeఅంతర్జాతీయంమోదీ గొప్ప వ్యక్తి… మిత్రుడు

మోదీ గొప్ప వ్యక్తి… మిత్రుడు

- Advertisement -

. రష్యా చమురు కొనడం ఆపేశారు
. వచ్చే ఏడాది భారత్‌ వస్తా: ట్రంప్‌

వాషింగ్టన్‌: ‘రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చాలా వరకు ఆపేశారు. ఆ దేశంతో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. కాబట్టి వచ్చే ఏడాది భారత్‌కు వెళ్లాలని ఉంది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడిరచారు. ఓవల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భారత్‌తో వాణిజ్య చర్చలలో పురోగతి ఉన్నట్లు తెలిపారు. ‘అంతా గొప్పగా సాగుతోంది. ఆయన (మోదీ) రష్యా నుంచి చమురు కొనడంలేదు. ఆయన మంచి మిత్రుడు. గొప్ప వ్యక్తి. మేమిద్దరం తరచూ మాట్లాడుకుంటాం. ఏ విధంగా ముందుకెళ్లాలో నిర్ణయిస్తాం. గతంలో నా భారత్‌ పర్యటన గొప్పగా సాగింది. మళ్లీ తప్పక వెళతాను’ అని ట్రంప్‌ అన్నారు. 2026లో న్యూదిల్లీలో జరగబోయే క్వాడ్‌ సదస్సుకు హాజరు కావచ్చన్న సంకేతాలు ఇచ్చారు. ఈ సదస్సు కోసం ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా దేశాలకు భారత్‌ ఆతిథ్యమివ్వనున్నది. అలాగే, సుంకాలు, భారత్‌`పాక్‌ మధ్య యుద్ధం ఆపడం గురించీ ట్రంప్‌ మాట్లాడారు. సుంకాలను గొప్ప అస్త్రంగా అభివర్ణించారు. న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైన జొహ్రాన్‌ మమ్దానీ అమెరికాను గౌరవించాలని, లేకపోతే బాధ్యతల నిర్వహణ కష్టమవుతుందని ట్రంప్‌ వ్యాఖ్చానించారు. ‘కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, గ్లోబలిస్టులపై అక్కసు వెళ్లగక్కారు. అధికారంలో ఉన్నంత వరకు అమెరికాను కమ్యూనిస్టు కానివ్వవన్నారు. ఇదిలావుంటే మమ్దానీకి సోషలిస్టులు, కమ్యూనిస్టుల అభినందనలు వెల్లువెత్తాయి. అమెరికాలో ప్రగతిశీల భావజాలం వ్యాప్తిని స్వాగతిస్తున్నట్లు జర్మనీ కమ్కూనిస్టు పార్టీ (ది లెఫ్ట్‌), కమ్యూనిస్టు పార్టీ యూఎస్‌ఏ వెల్లడిరచాయి. పెట్టుబడిదారీ వర్గంపై శ్రామిక వర్గం విజయమే తాము కోరేదని తెలిపాయి. మమ్దానీ గెలుపుతో సోషలిస్టు ఉద్యమానికి ఊపు తిరిగొచ్చిందని వ్యాఖ్యానించాయి. అమెరికా అంతటా సోషలిజంపై చర్చ జరుగుతున్నట్లు తెలిపాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు