Tuesday, July 15, 2025
Homeవిశ్లేషణమోదీ శాంతి వచనాల వెనక అదానీ

మోదీ శాంతి వచనాల వెనక అదానీ

ఆర్వీ రామారావ్‌

ఇజ్రాయిల్‌ భీకర స్థాయిలో విరుచుకు పడ్తున్నప్పుడు, అమెరికా అణు కేంద్రాలపై అమెరికా బాంబులు కురిపించినప్పుడు ప్రధానమంత్రి మోదీ మొక్కుబడి శాంతి వచనాలు మాత్రమే పలికారు. ఇజ్రాయిల్‌ ఇరాన్‌ మీద యుద్ధం ప్రకటించడం అన్న మాట కూడా ఎత్తకుండా ‘‘ఇది చాలా ఆందోళనకరం’’ అని మాత్రమే అన్నారు. అంటే అమెరికా ప్రత్యక్షంగా దాడికి దిగడాన్ని ఖండిరచడానికి మోదీ సిద్ధంగా లేరు. మోదీ వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. అయితే యుద్ధం ప్రారంభం అయిన అయిదు రోజులకు ఆదివారం ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడారట. అప్పుడే ఆయన ‘‘తీవ్ర ఆందోళన’’ వ్యక్తం చేశారు. వెంటనే ఉద్రిక్తతలు తగ్గించాలని కోరారు. ఇందులో ఓ తమాషా ఉంది. ఇరాన్‌ మీద యుద్ధానికి దిగిన ఇజ్రాయిల్‌ నాయకుడు నెతన్యాహుతో కాకుండా మోదీ ఇరాన్‌ అధ్యక్షుడితో మాట్లాడారు. అంటే చేయాల్సిన పని కాకుండా మొక్కుబడి తీర్చుకున్నారు.
రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఆపించానని మోదీ చెప్పుకున్నారు. ఈ సారి ఆ ప్రయత్నాలు చేయకుండా ‘‘తీవ్ర ఆందోళనకరం’’ అన్న మాటలతో సరిపెట్టారు. మోదీ ఇలా ప్రవర్తించడానికి కారణం లేకపోలేదు. ఇజ్రాయిల్‌లోని హైఫా రేవు పట్టణాన్ని ఇజ్రాయిల్‌ ప్రైవేటీకరించింది. దానిని ఆధునికీకరించే బాధ్యత అదానీకి ఇప్పించి మోదీ పుణ్యం కట్టుకున్నారు. అదానీకి ఈ కాంట్రాక్ట్‌ కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఇజ్రాయిల్‌లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. అసలు ప్రైవేటీకరణనే వ్యతిరేకించారు.
ఈ రేవు పట్టణం ఆధునీకరణలో ఇజ్రాయిల్‌ లోని ఓ కార్పొరేట్‌ సంస్థకు 30 శాతం, అదానీకి 70 శాతం కాంట్రాక్టులు దక్కాయి. హైఫా రేవు పట్టణంపై ఇరాన్‌ క్షిపణుల దాడివల్ల బాగానే నష్టం కలిగింది. అమెరికా, భారత్‌, ఇజ్రాయిల్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్‌ కలిపి గుజరాత్‌ ముద్రా రేవు పట్టణం నుంచి హైఫా రేవు పట్టణం దాకా ఒక రవాణా కారిడార్‌ నిర్మాణానికి దిగాయి. ఇది ప్రధానంగా చైనా వాణిజ్య కారిడార్‌కి పోటీగా అమెరికా చొరవతో మొదలు పెట్టిన కారిడార్‌! దీన్ని ఐ2 యు2 అంటారు. అంటే ఇండియా ఇజ్రాయిల్‌కు సంకేతంగా రెండు ‘‘ఐ’’లుÑ అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు సంకేతంగా రెండు ‘‘యు’’లు అని. నిజానికి దీన్ని అదానీ నుంచి అదానీదాకా అనే వ్యంగ్యార్థంలోనే ఈ మాట అంటారు. ముద్రా రేవు అధీనంలోనే ఉంది. హైఫా కాంట్రాక్టు అదానీకే దక్కడంవల్ల ఈ విమర్శ వచ్చింది.
ఇరాన్‌ దాడివల్ల హైఫా రేవు పట్టణం ధ్వంసం అయింది. హైఫా పోర్టుతో అదానీ సంబంధాన్ని మన మీడియా బొత్తిగా ప్రస్తావించదు. మరి తన అత్యంత సన్నిహిత అదానీకి నష్టం కలిగితే మోదీ పుట్టలో వేలు పెట్టినట్టే కదా! మోదీ పుట్టలో వేలు పెట్టినందువల్లే మోదీ అసలు యుద్ధాన్ని ఖండిరచకుండా ‘‘తీవ్ర ఆందోళనకరం’’ లాంటి మాటలతో సరిపెట్టారు. దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని మోదీ ఉచిత సలహా పారేశారు. అందుకే యుద్ధాన్ని ఖండిరచలేదు. ఇరాన్‌ అణు స్థావరాల మీద అమెరికా దాడిని ఖండిరచలేదు. అదానీకి నష్టం కలగకుండా ఉంటే పశ్చిమాసియా సంక్షోభాన్ని మోదీ పట్టించుకునే వారే కాదేమో!
పలస్తీనా, గాజా మీద కాల్పుల విరమణ తరవాత కూడా ఇజ్రాయిల్‌ మారణ హోమం కొనసాగించడం మోదీకి అసలే కనిపించదు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి అమెరికా, ఇజ్రాయిల్‌ పాల్పడే ఆగడాలు మోదీకి అసలే కనిపించవు. కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండిరచాయి. మోదీ ప్రవర్తన మన విదేశాంగ విధానం గాడి తప్పిందనడానికి ఉదాహరణ. మిత్ర దేశమైన ఇరాన్‌ పక్షాన నిలబడక పోవడం ఈ అనుచిత విదేశాంగ విధానానికి ఓ మచ్చు తునక.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు