Homeక్రీడలుయుద్ధం వేళ నిలిచిన శాంతి చర్చలు

యుద్ధం వేళ నిలిచిన శాంతి చర్చలు

- Advertisement -

మాస్కో: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్‌కు మధ్య శాంతి చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు క్రెమ్లిన్ పేర్కొంది. ఇరాన్ యుద్ధం కీవ్‌ను రాజీ దిశగా నెట్టే అవకాశమున్నదన్నది. ఈ మేరకు రష్యా అధికారులు చెప్పినట్లు ఇజ్వెస్టియా గురువారం నివేదించింది. ప్రతిష్ఠంభనను క్రెమ్లిన్ ధ్రువీకరించినట్లు నివేదిక తెలిపింది. జెనీవాలో అమెరికా, ఉక్రెయిన్‌తో ముగిసిన చర్చల తర్వాత యుద్ధానికి డెడ్‌లైన్లు ఉండవంటూ రష్యా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందిస్తూ త్రైపాక్షిక చర్చలకు విరామం వచ్చిందన్నారు. అదే సమయంలో పెట్టుబడులు, ఆర్థిక సహకారం కోసం తన పనిని దౌత్యాధికారి కిరిల్ కొనసాగిస్తారని తెలిపారు. ఈ మేరకు ఇజ్వెస్టియా నివేదిక పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు