Homeరూ.2 వేలు దాటితే రూ.8 చార్జీ

రూ.2 వేలు దాటితే రూ.8 చార్జీ

- Advertisement -
  • రూ.75 వేలు… ఆపై లావాదేవీలకు రూ.300
  • చిన్న వ్యాపారులకు ప్రత్యేక మినహాయింపు
  • యూపీఐపై సర్కారు ప్రకటన

న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాన్ని తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకున్న మోదీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై ‘యూపీఐ’ భారం మోపేందుకు సిద్ధమైంది. వినియోగం ఉచితమే అయినప్పటికీ రూ.2 వేలకు మించిన లావాదేవీలపై ఎండీఆర్ (మర్చెంట్ డిస్కౌంట్ రేట్) విధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న జీరో-ఎండీఆర్ విధానానికి తెర దించింది. రూ.2,000కు మించి వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం అంటే దాదాపు ఎనిమిది రూపాయాల ఎండీఆర్ ప్రకటించింది. అలాగే రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిగే లావాదేవీలకు ఎండీఆర్‌ను రూ.300కు పరిమితం చేసింది. ఈ మేరకు కేంద్రం వెల్లడించింది. యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించేందుకు గతంలో ఉన్న విధానాన్ని మారాల్చలని… బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలపై ఆర్థిక భారం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త వ్యవస్థను తీసుకొచ్చామని వివరణ ఇచ్చుకున్నది. అయితే వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి జరిగే లావాదేవీలు పూర్తిగా ఉచితమని ప్రకటించింది. కొత్త చార్జీలతో చిన్న వ్యాపారులపై భారం పడకుండా కేంద్రం ప్రత్యేక మినహాయింపు ప్రకటించింది. నెలకు రూ.లక్ష వరకు యూపీఐ క్యూఆర్ ఆదాయంపై చార్జీ లేదని తెలిపింది. రైల్వేలు, టెలికాం, ఇంధనం రంగాల్లో ఒక్కో లావాదేవీకి రూ.5, క్యాపిటల్ మార్కెట్‌లలో 0.02 శాతం చొప్పున అమలు చేయనున్నట్లు తెలిపింది. ఎండీఆర్‌ను వినియోగదారులపై మోపరాదని వ్యాపారులకు స్పష్టంచేసింది. యూపీఐ యాప్‌లు సైతం అదనపు ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేయరాదని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో రూ.2,000కు మించే లావాదేవీలకు బాదుడు తప్పదన్న పరిస్థితి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారులపై పడే భారాన్ని అంతిమంగా భరించాల్సింది వినియోగదారుడే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సైబర్ భద్రత, మోసాల నియంత్రణ, మౌలిక వసతుల నిర్వహణకు భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయని, యూపీఐ విస్తరణను ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడి కొనసాగించడం కుదరదని, వ్యవస్థ స్వయంసమృద్ధిగా మారాలని, అందుకోసమే ఇలాంటి చర్యలు తప్పవని సర్కారు చెబుతోంది. యూపీఐ పరిమాణం, వినియోగం, చిన్న వ్యాపారులపై ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అంతర్జాతీయ రేట్లను నేరుగా అనుసరించాలనుకోవడం సరికాదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జులైలోనే దేశంలో 2,366 కోట్ల మేర యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.29.9 లక్షల కోట్లు. 2017లో రూ.0.07 లక్షల కోట్ల లావాదేవీల స్థాయి నుంచి 2026లో రూ.314 లక్షల కోట్లకు విలువ పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన డిజిటల్ మౌలిక వసతిగా ఇది మారిపోయింది. చార్జీలు అధికారికంగా వ్యాపారిపై విధించినా దాని ప్రభావం అంతిమంగా వస్తువులు, సేవల ధరలు రూపంలో వినియోగదారుడిపైనే పడుతుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్‌, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా, గ్రీస్, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో యూపీఐ చెల్లింపుల విధానం అమల్లో ఉన్నది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు