Wednesday, February 18, 2026
Homeసినిమారోడ్డు ప్రమాదంలో బుల్లితెర హాస్యనటుడు బాబీ మృతి

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర హాస్యనటుడు బాబీ మృతి

- Advertisement -

హైదరాబాద్: తెలుగు బుల్లితెరపై ‘జబర్దస్త’, ‘సుమ అడ్డా’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు లక్ష్మీనారాయణ (బాబీ) రోడ్డు ప్రమాదంలో మతి చెందారు. రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై సోమ వారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతివేగంగా వచ్చిన రెండు బైక్‌లు బలంగా ఢీకొనడంతో ఈ అనర్థం జరిగింది. ఈ ప్రమా దంలో బాబీతో పాటు అక్షయ్ కుమార్, సత్యకుమార్ అనే మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోవ డం అందరినీ కలచివేస్తోంది. హెల్మెట్లు ధరించకపోవ డం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాబీ (28) మరణవార్త విన్న వెంటనే స్టార్ యాంకర్ సుమ కనకాల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హైదరాబాద్ నుండి హుటాహుటిన రాజమండ్రి చేరుకున్న సుమ, బాబీ భౌతికకాయానికి నివా ళులర్పించారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే బాబీని అలా విగతజీవిగా చూడటంతో సుమ కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆమె, బాబీ మృతి టెలివిజన్ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. జబర్దస్త్ కమెడియన్లు… ఇతర సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా బాబీకి నివాళులర్పిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు