. 40 నగరాల్లో భారీ ర్యాలీలు
. విద్యా రంగంలో సమస్యల పరిష్కారానికి డిమాండ్
ఏథెన్స్: గ్రీస్‌లో విద్యార్థులు భారీస్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యా రంగంలో సమస్యల పరిష్కారానికి కదం తొక్కారు. అధ్యాపకుల నియామకాలు, వారి క్రమబద్ధీకరణ, మెరుగైన బోధనా పద్ధతులు, వేతనాల్లో పెంపుదల కోసం డిమాండ్ చేశారు. దేశంలోని 40 నగరాల్లో ర్యాలీలు జరిగాయి. లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు వారికి మద్దతు ఇచ్చారు. అధ్యక్షుడు తసౌలాస్ ప్రభుత్వం అనుసరించే కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించారు. విద్యను వ్యాపారంగా మార్చవద్దని, విజ్ఞానాన్ని పెంపొందించే విద్యా సంస్థల్లో సిబ్బంది కొరతను పరిష్కరించాలని, తక్షణమే టీచర్లను భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యా రంగంలో సంస్కరణలు, బోధనా పద్ధతుల్లో మెరుగుదలను కోరారు. పేదలకు విద్యను దూరం చేయొద్దన్నారు. విద్యను ఆధునికీకరించాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థకు చేరిన విద్యా సంస్థల భవనా లను పునరుద్ధరించాలని, స్కూళ్లను విలీనం చేసే నెపంతో 10 కిమీల దూరంలోకి బడులను తరలించడంతో రవాణా ఖర్చు విద్యార్థులకు భారమవుతున్నట్లు నిరసనకా రులు వెల్లడిరచారు. విద్యా వ్యవస్థకు సముచిత నిధులు కేటాయించాలని, మెరుగైన విద్యా అవసరాలు, సదుపాయాల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని విద్యార్థులు, అధ్యాపకులు హెచ్చరించారు.
రోడ్డెక్కిన గ్రీస్ విద్యార్థులు
- Advertisement -
RELATED ARTICLES


