Wednesday, February 18, 2026
Homeవిశ్లేషణవందేళ్లలో ఏం సాధించామోచరిత్ర చెపుతుంది !

వందేళ్లలో ఏం సాధించామోచరిత్ర చెపుతుంది !

- Advertisement -

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల చరిత్ర మహోన్నతమైనది. అయితే ఈ వందేళ్లలో సీపీఐ ఏం చేసింది? అనేది చాలామంది ప్రశ్న. అధికారం చేపడితే తప్ప ఆ పార్టీకి విలువ ఉండదనేది చాలామంది భ్రమ. అందుకే దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
వంద సంవత్సరాలలో సీపీఐ ఏమీచేయలేదా ?
1757లో ప్లాసీ యుద్ధం తర్వాత 1857లో ప్రథమ స్వాతంత్య్ర పోరాటం జరిగిన తర్వాతనే భారత స్వాతంత్య్ర పోరాటానికి తొలిసారి గుర్తింపు లభించింది. (అయితే, దీనిని సిపాయి తిరుగుబాటుగా దురుద్దేశంతో పిలవబడిరది). 1885లో బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ స్థాపించబడిరది. 1915 నుండి గాంధీ మహాత్ముడు స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ ఉద్యమంలో యధాతథవాదులు, తీవ్రవాద భావజాల కలయిక సంయుక్తంగా ఉద్యమం నిర్వహించబడిరది. దీంతో స్వతంత్ర ఉద్యమానికి ఒక స్పష్టత కొరవడిరది. స్వాతంత్య్రమా లేక సర్వ (సంపూర్ణ) స్వాతంత్య్రమా? దీనిపై చర్చోప చర్చలు జరిగాయి. కమ్యూనిస్టు భావాలు కలిగిన వారి ఒత్తిడి మేరకే సంపూర్ణ స్వాతంత్య్ర కొరకు తీర్మానం చేయబడిరది . స్వాతంత్య్రానంతరం ఎలాంటి స్వాతంత్య్రం అమలు జరగాలో దానిపై గాంధీకి గానీ కాంగ్రెస్‌ పార్టీకి గాని స్పష్టత లేదు. లేదా ఇవ్వద లుచుకోలేదో ??? ఈ నేపథ్యంలో ముసుగులో గుద్దులాటకన్నా బహిరంగంగా రావడమే మేలని కమ్యూనిస్టులంతా కలిసి 1925 డిసెంబర్‌ 26న ఉత్తర ప్రదేశ్‌ లో జాతీయ స్థాయి కమ్యూనిస్టు పార్టీ (కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా)గా ఏర్పడిరది.
మొదటి తీర్మానం సంపూర్ణ స్వాతంత్య్రం, రెండవది దున్నేవాడికే భూమి తదితర మౌలిక అంశాలతో ప్రజలముందుకు వచ్చింది సిపిఐ. ఆనాటి నుండి భూ సమస్య తెరమీదికి రావడమేగాక, తెలంగాణా సాయుధ పోరాటం, భూమికోసం భుక్తి కోసం సాయుధ పోరాటం, బెంగాల్‌లో తేబాగా, కేరళలో పున్నప్ర వాయలార్‌, ఆంధ్రాలో చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటాలు ఉవ్వెత్తున లేచాయి. భూఉద్యమం జాతీయస్థాయి అజెండాగా రూపొందింది.
1917లో రష్యాలో కమ్యూనిస్టు విప్లవ విజయం, దాని ప్రభావం మనదేశంపై పడిరది. ఆ ప్రభావమే బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ నాయకత్వాన రూపొందించిన భారత రాజ్యాంగం. అలాగే ఆనాటి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌పై కూడా ప్రభావం పడబట్టే ప్రభుత్వ రంగ నిర్మాణం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల వేర్పాటు ఉద్యమాలలో కమ్యూనిస్టుల ప్రతిఘటనే భారతదేశ ఐక్యతకు తోడ్పడిరది. ఈ ప్రతిఘటనోద్యమంలో అనేకమంది కమ్యూనిస్టు యోధానుయోధులను పోగొట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది సీపీఐ మాత్రమే.
పై ఉద్యమాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ గానీ, ఆనాటి జనసంఫ్‌ు, ఇప్పటి బిజెపి వ్యక్తులు గానీ పాల్గొన్నారా? జైలుకు వెళ్లారా? అధికారం లేకపోయినా దేశాన్ని కాపాడగలిగాం, దళితులకు, గిరిజనులకు, ఇతర బలహీన వర్గాలకు అండగా ఉండేది కమ్యూనిస్టులేనని గుండె మీద చేయి వేసికుని చెప్పగలం.
కమ్యూనిస్టుల పార్లమెంటరీ ప్రాతినిధ్యం విషయానికొస్తే, 61 మంది వామపక్ష పార్లమెంట్‌ సభ్యులుండబట్టే గదా పనికి ఆహార పథకం సాధించగలిగాం. కమ్యూనిస్టులు బలహీనపడబట్టేగదా అటు పార్లమెంట్‌లోనూ ఇటు శాసనసభలలో ప్రజాసమస్యలపై చర్చ జరగకూడా, వాటని పక్కదారిపట్టించి, చివరకు ‘‘నీవు వెధవవి నీవే వెధవవి అని తిట్టిపోసుకుంటూ సంపద యావత్తూ కార్పొరేట్‌ వర్గాలకు ధారాదత్తం చేసే కుటిల యత్నాలకు కొమ్ముకాస్తున్నారు.
నన్ను చాలామంది హేళనగా మాట్లాడుతుంటారు. పుట్టేవాడికి అన్న, పెరిగేవాడికి తమ్ముడు అదేగా సీపీఐ అని అంటారు. అలాగే, నీకు సమకాలికుడు నారా చంద్రబాబునాయుడు. అతను నాలుగు దఫాలు ముఖ్యమంత్రి అయ్యాడు. నిన్నగాక మొన్నపుట్టిన రేవంత్‌ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. మరి మీపార్టీ పుట్టిన 1925 సంవత్సరమే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా పుట్టింది. అదేమో రాజ్యాధికారానికే వచ్చింది. నీవేమో ఇంకా జెండాలు పట్టుకుని తిరుగుతున్నావు. అంతేనా?? అని అంటూ ఉంటారు.
నిజమే. కాకపోతే, మెరిచేదంతా బంగారం కాదు, చూసేదంతా నిజమూ కాదని నానుడి ఉంది. అది తర్కం ద్వారా నిజమని తేలింది. అయితే ఆ తర్కంలోకి పోవడానికి ఇది సందర్భం కాదు. సిపిఐ గురించి మరో కోణంలో చూడగలిగితే చరిత్రకు న్యాయం జరుగుతుంది. కమ్యూనిస్టులు దేశమౌలిక విధానాల పట్ల నిబద్ధతగా నిలబడ్డారని చరిత్ర చెపుతుంది. వందేళ్ల సీపీఐ ప్రస్థానం భారతదేశానికి కొలమానంగా నిలబడిరదా? లేదా? మతోన్మదాన్ని ఎండగట్టింది. జనంలో చైతన్యాన్ని తట్టిలేపింది. నేటికీ ప్రతి సమస్యపైనా పోరాడే ఏకైక పార్టీగా సీపీఐ నిలబడిరది. ఇది వాస్తవం కాదా? అయితే, ప్రస్తుత కమ్యూనిస్టుల కర్తవ్యమేమిటి ? ఎర్రజెండాలకు అంకితమయిన పార్టీలన్నీ ఒకగూటికి చేరాల్సిన తరుణం ఆసన్నమయింది. ‘‘ఆలస్యం అమృతం విషం‘‘.
సీపీఐ జాతీయ నాయకులు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు