Wednesday, February 18, 2026
Homeసినిమా‘వారణాసి’ ఒక భాగమేదర్శకుడు రాజమౌళి

‘వారణాసి’ ఒక భాగమేదర్శకుడు రాజమౌళి

- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ రెండు భాగాలుగా వస్తోందనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి రాజమౌళి చెక్ పెట్టారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… రెండు భాగాలుగా సినిమాను నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ చివరకు ఒక పార్ట్ గానే విడుదల చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండవచ్చని సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పాత్రలో మహేశ్ బాబు నటిస్తున్నారు.
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. పూర్తి స్థాయి ఐమ్యాక్స్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించబోతోంది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు