హైదరాబాద్: శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘బైకర’. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. బుధవారం రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లింప్స్‌ను వదిలారు. ఇందులో, రాజశేఖర్ ‘బుల్లెట్ సునీల’ అనే మాజీ మోటోక్రాస్ రేసర్‌గా కనిపిస్తున్నారు. భారతీయ రేసర్లు అంతర్జాతీయ చాంపియన్‌షిప్ గెలవాలనే లక్ష్యంతో పనిచేసే ఒక పవర్‌ఫుల్ మెంటార్ పాత్రలో రాజశేఖర్ అదరగొట్టబోతున్నారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే రాజశేఖర్ నటన సినిమాకే హైలైట్ అవుతుందనిపిస్తోంది. యాక్షన్, ఎనర్జీతో కూడిన ఈ వీడియో సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. శర్వానంద్` రాజశేఖర్ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ రేసింగ్ డ్రామా శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.


