Friday, March 6, 2026
Homeసినిమాషూటింగ్ ఆపేద్దామన్నా రామ్‌చరణ్ వినలేదు

షూటింగ్ ఆపేద్దామన్నా రామ్‌చరణ్ వినలేదు

- Advertisement -

‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు
హైదరాబాద్: ‘పెద్ది’ సినిమాలో తొలి పాట ‘చికిరి చికిరి’కి రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కాయి. అందులోని హుక్‌స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సోమవారం రాత్రి విడుదలైన రెండో పాట ‘రయ్ రయ్ రారా’ కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే నెటిజన్లు ఈ సాంగ్‌కు సంబంధించిన రీల్స్‌తో సందడి చేస్తున్నారు. కేవలం తెలుగు లిరికల్ వీడియోకే యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ 17 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ విజయం వెనుక దాగిన కష్టాన్ని చిత్ర దర్శకుడు బుచ్చిబాబు పంచుకున్నారు. ఈ పాట షూటింగ్ సమయానికి రామ్‌చరణ్‌కు తీవ్ర జ్వరం ఉందని, దీంతో షూటింగ్ ఆపేద్దామని చెప్పినా ఆయన వినలేదని తెలిపారు. పాట బాగుందంటూ చిరంజీవి పెట్టిన పోస్టుకు బదులిస్తూ… షూటింగ్ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ‘ఆ రోజు ఇంకా గుర్తుంది సర్. ఈ బీజీఎం (పాటలోని నేపథ్య సంగీతం) షూటింగ్ చేస్తున్నప్ప్పుడు చరణ్‌కు తీవ్ర జ్వరం. మేం షూటింగ్ ఆపేద్దామన్నా ఆయన ‘లేదు చేద్దాం’ అని అన్నారు. అంత జ్వరంలోనూ చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్ చేశారు. ఆ డెడికేషన్ అన్నీ మీ నుంచి వచ్చినవే సర’ అని బుచ్చిబాబు పేర్కొన్నారు.
చరణ్ డ్యాన్స్ గర్వకారణం: చిరంజీవి
‘రయ్ రయ్ రారా’ సాంగ్ స్క్రీన్‌పై ఓ ఫైర్‌లా ఉందంటూ చిరంజీవి పోస్టు పెట్టారు. అది ఎనర్జీ, ఎమోషన్‌లతో కూడిన అద్భుతమని కొనియాడారు. చరణ్ గ్రేస్, డ్యాన్స్‌లో వేగం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, గేయ రచయిత అనంత శ్రీరామ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, దర్శకుడు బుచ్చిబాబు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నిర్మాత వెంకట సతీశ్ కిలారులను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తరాంధ్ర నేపథ్యంతో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
రూమర్స్ నమ్మకండి…
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా నిడివిపై కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీని నిడివి మూడు గంటలకు పైగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై టీమ్ స్పందిస్తూ వాటిని ఖండించింది. ‘పెద్ది నిడివిపై వస్తోన్న వార్తలను నమ్మకండి. ఇప్పటివరకూ ఫస్ట్‌హాఫ్ మాత్రమే ఫైనల్ అయింది. సెకండ్ హాఫ్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. దీనితో పాటే డబ్బింగ్, ఎడిటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అవి పూర్తవుతాయి. ఏప్రిల్ 30న మీ ముందుకురావడానికి అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయి’ అని టీమ్ పేర్కొంది. ఈ సినిమాలోని మొదటి పాట చికిరి చికిరి, రెండో పాట ‘రయ్ రయ్ రారా అడ్డే లేని దారై రారా’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించడంతో పాటు స్వయంగా పాడారు. ఈ పాటకు రామ్‌చరణ్ వేసిన హుషారైన స్టెప్స్ ఆకర్షణగా నిలవడంతో వైరల్ అవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు