చెన్నై: తమిళ నటుడు విజయ్ రాజకీయపార్టీని స్థాపించి సినిమాలకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. తన ఆఖరి చిత్రం జన నాయకుడు విడుదలకు ఇంకా నోచుకోలేదు కానీ ఈ వ్యవధిలో మాత్రం విజయ్ కి ఊహించని సమస్యలు వచ్చాయి. తన భార్య సంగీత… విజయ్ విడాకులు కావాలని కోరుతూ కోర్టు మెట్లు
ఎక్కడం షాకింగ్ గా మారింది. అయితే ఈ సమస్యపై మరో షాకింగ్ రూమర్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. తమ సమస్యని విజయ్ గోప్యంగా పరిష్కరించుకునేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు గాను విజయ్… తన భార్య, పిల్లలు జేసన్ సంజయ్, సాషాల భవిష్యత్తు, ఆర్థిక
నిలకడ కోసం భారీ మొత్తంలో రూ. 250 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ విధంగా తమ సమస్యని సెటిల్ చేసుకోవాలని విజయ్ భావిస్తున్నట్టు కొన్ని కొత్త రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా, విజయ్ మరోపక్క తన రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఈ ఏడాది తమిళనాట జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించారు.
సంగీతతో రాజీకి విజయ్ సిద్ధం ?
- Advertisement -


