64 మంది మృతి
ఖర్తౌమ్: సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ గ్రూప్ ‘ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆరఎసఎఫ్) బలగాల మధ్య మూడేళ్లుగా ఆధిపత్యపోరు కొనసాగు తున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఈస్ట్ దార్ఫూర్లోని ఓ ఆస్పత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో 64 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 13 మంది చిన్నారులు, ఒక వైద్యుడు, ఇద్దరు నర్సులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తెలిపింది. ఈ డ్రోన్ దాడిలో 64 మంది మరణించడమేగాక మరో 89 మంది గాయపడినట్లు పేర్కొంది. ‘ఇప్పటి వరకు ఆస్పత్రులపై జరిగిన దాడుల్లో 2,000 మందికిపైగా మృతిచెందారు. ఇదిలావుంటే ఆస్పత్రిపై దాడికి పాల్పడింది సైన్యమేనని ఆరఎసఎఫ్ ఆరోపించగా… సైన్యం ఖండించింది.
సూడాన్‌లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి
- Advertisement -
RELATED ARTICLES


