Homeఅంతర్జాతీయంసూడాన్‌ ప్రభుత్వం రద్దు

సూడాన్‌ ప్రభుత్వం రద్దు

- Advertisement -

బీరుట్‌: సూడాన్‌లో ప్రభుత్వం రద్దు అయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా కసరత్తుకు ముందుగా మంత్రివర్గాన్ని రద్దు చేస్తూ ప్రధాని కామిల్‌ ఇద్రీస్‌ ఆదేశాలిచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు బాధ్యతలను ఆయా మంత్రిత్వశాఖల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు అప్పగించాలని ఇద్రీస్‌ నిర్ణయించారు. సూడన్‌ ప్రధానిగా ఇద్రీస్‌ శనివారం బాధ్యతలు చేపట్టారు. 2021 నుంచి సైనిక తిరుగుబాటు క్రమంలో సూడాన్‌కు మొదటి ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రజలకు సందేశమిస్తూ రాజకీయ సుస్థిరతకు కృషి చేస్తానన్నారు. సుస్థిరతకు, భద్రతకు కట్టుబడతానని చెప్పారు. దేశ సమగ్ర పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యత ఇస్తానని ఇద్రీస్‌ వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు