Tuesday, July 15, 2025
Homeస్టాక్‌ మార్కెట్‌లో భారీ కుంభకోణం

స్టాక్‌ మార్కెట్‌లో భారీ కుంభకోణం

రూ.36,500 కోట్ల మేర మోసం

. వెలుగులోకి జేన్‌ స్ట్రీట్‌ అక్రమాలు
. సెబీ కఠిన చర్యలు

న్యూదిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్‌లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద క్వాంటిటేటివ్‌ ట్రేడిరగ్‌ సంస్థల్లో ఒకటైన జేన్‌ స్ట్రీట్‌… భారత ఇన్వెస్టర్లను మోసం చేసి మార్కెట్‌ను మానిప్యులేషన్‌ చేసిందని సెబీ ఆరోపించింది. దీనిద్వారా రూ.36,500 కోట్ల భారీ లాభాలు ఆర్జించిందని సెబీ తెలిపింది. దీంతో ఈ సంస్థను ప్రస్తుతం మార్కెట్‌ నుంచి నిషేధించారు. జేన్‌ స్ట్రీట్‌ అనేది 3 వేల మందికి పైగా ఉద్యోగులతో, 45 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక అంతర్జాతీయ వాణిజ్య సంస్థ. గతేడాది భారత మార్కెట్‌లో అత్యంత లాభదాయకమైన ఆప్షన్స్‌ ట్రేడిరగ్‌ వ్యూహాన్ని రూపొందించినట్లు ఈ సంస్థ గురించి వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ సంస్థపై సెబీ గుర్తించిన అక్రమాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సెబీ దర్యాప్తులో జేన్‌ స్ట్రీట్‌ రెండు ప్రధాన వ్యూహాలు ఉపయోగించినట్లు తేలింది. అవేమిటంటే…మార్నింగ్‌ పంప్‌, ఆఫ్టర్‌ నూన్‌ డంప్‌ వ్యూహం. ఆ క్రమంలో ఉదయం స్టాక్స్‌, ఫ్యూచర్స్‌ను భారీగా కొనుగోలు చేసి నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ సూచీలను పెంచేవారు. మధ్యాహ్నం తర్వాత వాటిని భారీగా విక్రయించేవారు. దీనివల్ల మార్కెట్‌ బలంగా ఉన్నట్లు సామాన్య ఇన్వెస్టర్లు భావించి పెట్టుబడులు పెట్టేవారు. కానీ చివరకు మార్కెట్‌ పడిపోవడంతో వారు నష్టపోయేవారు. మరో విధానంలో ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ రోజుల్లో మానిప్యులేషన్‌. ఆప్షన్స్‌ కాంట్రాక్ట్‌ల చివరి రోజున మార్కెట్‌ ముగిసే సమయంలో భారీ ట్రేడ్‌లు చేసి సూచీలను తమకు అనుకూలంగా మార్చేవారు. దీనివల్ల వారి ఆప్షన్స్‌ పొజిషన్స్‌ నుంచి భారీ లాభాలు పొందేవారు. ఈ క్రమంలో జేన్‌ స్ట్రీట్‌కు సంబంధించిన నాలుగు సంస్థలైన జేఎస్‌ఐ ఇన్వెస్ట్‌మెంట్స్‌, జేఎస్‌ఐ 2 ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేన్‌ స్ట్రీట్‌ సింగపూర్‌ పీటీఈ, జేన్‌ స్ట్రీట్‌ ఆసియా ట్రేడిరగ్‌ భారత మార్కెట్‌లో ట్రేడిరగ్‌ చేయకుండా నిషేధించబడ్డాయి. వీటి బ్యాంక్‌ ఖాతాల నుంచి డబ్బు ఉపసంహరణకు కూడా అనుమతి నిషేధించారు. ఫిబ్రవరిలో సెబీ హెచ్చరించినప్పటికీ జేన్‌ స్ట్రీట్‌ ఈ అక్రమ ట్రేడిరగ్‌ను కొనసాగించింది. దీంతో సెబీ చర్యలు తీసుకుంది. జేన్‌ స్ట్రీట్‌ ఈ ఆరోపణలను ఖండిరచినప్పటికీ ఈ కేసు భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద మానిప్యులేషన్‌ కేసుల్లో ఒకటిగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు