Homeవ్యాపారంస్విగ్గీతో మెక్‌ డొనాల్డ్‌ ఒప్పందం

స్విగ్గీతో మెక్‌ డొనాల్డ్‌ ఒప్పందం

- Advertisement -

న్యూదిల్లీ: 2025, జులై 24 నుండి ఆగస్ట్‌ 11 వరకు స్విగ్గీ యాప్‌పై ప్రత్యేకంగా లభించే తమ ప్రోటీన్‌ ప్లస్‌ బర్గర్స్‌ శ్రేణిని విడుదల చేయడానికి మెక్‌ డొనాల్డ్‌ ఇండియా (డబ్ల్యు అండ్‌ ఎస్‌)తో భాగస్వామం గురించి భారతదేశపు ప్రముఖ ఆన్‌-డిమాండ్‌ కన్వీనియెన్స్‌ ప్లాట్‌ ఫాం స్విగ్గీ లిమిటెడ్‌ బుధవారం ప్రకటించింది. కస్టమర్లు స్విగ్గీ యాప్‌ ‘హై ప్రోటీన్‌’ విభాగాన్ని సందర్శించడం ద్వారా ఈ ఆరోగ్యవంతమైన శ్రేణి నుండి తమకు ఇష్టమైన బర్గర్లను ఆర్డర్‌ చేయవచ్చు. ఈ శ్రేణి ముంబయి, బెంగళూరు, పూణె, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌, కొచ్చీ, వైజాగ్‌, సూరత్‌, మైసూర్‌ వంటి నగరాలు సహా పశ్చిమ మరియు దక్షిణ భారతదేశపు రాష్ట్రాల్లోని 58 నగరాల్లో స్విగ్గీ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. మెక్‌ డొనాల్డ్స్‌ వారి రియల్‌ ఫుడ్‌ రియల్‌ గుడ్‌ జర్నీలో భాగంగా, మెక్‌ డొనాల్డ్‌ ప్రోటీన్‌ ప్లస్‌ను ప్రారంభించింది. సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ)సహకారంతో ఈ వినూత్నమైన, ఆరోగ్యకరమైన శ్రేణి అభివృద్ధి చేయబడిరది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు