Homeఅంతర్జాతీయంఅమెరికాకు వాణిజ్యం ఓ అస్త్రం

అమెరికాకు వాణిజ్యం ఓ అస్త్రం

- Advertisement -

భారత్‌తో ఇంధన సహకారానికి ఢోకాలేదు: రష్యా
మాస్కో : భారత్‌ విషయంలో అమెరికా చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని రష్యా వ్యాఖ్యానించింది. భారత్‌-రష్యా మధ్య ఇంధన సహకారం భవిష్యత్తులోను కొనసాగుతుందని ఆ దేశ దౌత్యవేత్త రోమన్‌ బబుష్కిన్‌ వెల్లడిరచారు. భారత్‌తో సంబంధాలపై పూర్తి విశ్వాసముందని చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలను ఆయుధంలా వాడుతోందని విమర్శించారు. భారత్‌కు ఎటువంటి ఇబ్బంది రాకుండా చమురు సరఫరా చేసేందుకు మాస్కో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. సగటున ఐదు శాతం రాయితీతో భారత్‌ అవసరాల్లో 40 శాతం మేర సరఫరా చేస్తున్నామని చెప్పారు. అమెరికా మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు భారత్‌ ఇబ్బంది పడుతుంటే, రష్యా మార్కెట్లు స్వాగతం పలుకుతాయని బబుష్కిన్‌ వెల్లడిరచారు. భారత్‌కు అండగా నిలుస్తామని, చిన్న, మాడ్యులర్‌ అణు రియాక్టర్లపై చర్చలు పురోగతి సాధించినట్లు చెప్పారు. గతంలో బ్రహ్మోస్‌ క్షిపణుల తయారు చేశాం. ఇప్పుడు శక్తిమంతమైన జెట్‌ ఇంజిన్లపై పని చేస్తున్నామన్నారు. అధ్యక్షుడు పుతిన్‌ స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు ప్రధాని మోదీతో మాట్లాడారని, సమస్యల పరిష్కారానికి భారత్‌, రష్యా కలిసి పని చేస్తున్నాయన్నారు. రష్యాను శిక్షించేందుకు ఆంక్షలు విధించినవారే అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారని రోమన్‌ బబుష్కిన్‌ చెప్పారు. కాగా, రష్యా ఉత్పత్తి చేసే ఉరల్స్‌ చమురు కొనుగోళ్లను భారత్‌ రిఫైనరీలు పునరుద్ధరించాయి. ఐవోసీ, బీపీసీఎల్‌ తాజాగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో సరఫరాకు ఆర్డర్లు పెట్టాయి. భారత్‌ నుంచి కొనుగోళ్లు పెరగడంతో చైనాకు సరఫరాలు తగ్గనున్నాయి. జులైలో రాయితీలు తగ్గడంతో భారత సంస్థలు కొనుగోళ్లు నిలిపివేశాయి. అనంతరం రాయితీ 3 డాలర్లకు పెరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు