వాషింగ్టన్: భారత్, చైనా, బంగ్లాదేశ్ సహా 16 కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా వాణిజ్య చట్టం1974లోని ‘సెక్షన్ 301’ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. టారిఫ్లు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి క్రమంలో ఆయా దేశాలపై సుంకాలతో ఒత్తిడి పెంచేలా వాణిజ్య విధానాల దర్యాప్తులు ప్రారంభించింది. సెక్షన్ 301... వాణిజ్య భాగస్వాములపై సుంకాలు లేదా ఇతర ప్రతీకార చర్యలను చేపట్టే అధికారాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధికి ఇస్తుంది. ఇతర దేశాలు అనుసరిస్తున్న చట్టవిరుద్ధమైన వాణిజ్య విధానాలను సవాలు చేయడమే ఈ సెక్షన్ లక్ష్యం. వాణిజ్య భాగస్వాములు వాణిజ్య విధానాలు అమెరికా పయోజనాలకు నష్టం కలిగిస్తాయనే క్రమంలో ఈ సెక్షన్ ద్వారా దర్యాప్తు చేసేందుకు అమెరికాకు అంధికారం ఉంది. విచారణ, సాక్ష్యాధారాల సేకరణ అనంతరం తమకు నష్టం కలిగిస్తున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి లేకుండానే ఆయా దేశాలపై ఏకపక్షంగా చర్యలకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో యూరోపియన్ యూనియన్, భారత్, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో దేశాలపై కొత్త సుంకాలు విధించవచ్చని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ వెల్లడించారు. అదనపు సామర్థ్య దర్యాప్తుకు లోబడి ఉన్న ఇతర వాణిజ్య భాగస్వామ్యులలో తైవాన్, వియత్నాం, థాయిలాండ్, మలేసియా, కంబోడియా, సింగపూర్, ఇండోనేసియా, బంగ్లాదేశ్, స్విట్జర్లాండ్, నార్వే దేశాలున్నాయి. వాణిజ్య దర్యాప్తు కింద అమెరికా రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశం కెనడా పేరును సూచించలేదు. ఈ దర్యాప్తులు తయారీ రంగాల్లో నిర్మాణాత్మక అదనపు సామర్థ్యంఉత్పత్తి ఆధారాలున్న ఆర్థిక వ్యవస్థలపై దృష్టిసారిస్తాయి. ఈ మేరకు గ్రీర్ కాన్ఫరెన్స్ కాల్లో వెల్లడించారు. బలవంతపు ఉత్పత్తిదిగుమతులను నిషేధించడానికి సెక్షన్ 301 కింద మరో దర్యాప్తును ప్రారంభించనున్నట్లు గ్రీర్ తెలిపారు. ఈ దర్యాప్తు 60కంటే ఎక్కువ దేశాలకు వర్తిస్తుందన్నారు. మాజీ అధ్యక్షుడు బైడన్ సంతకం చేసిన ఉయ్ఘర్ ఫోర్స్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చైనా సోలార్ ప్యానెల్ దిగుమతులుఇతర వస్తువులపై అమెరికా కఠిన ఆంక్షలు అమలు చేసింది.
అమెరికా వాణిజ్య భాగస్వాములపై ‘సెక్షన్ 301’
- Advertisement -
RELATED ARTICLES


