సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని సర్వేనెంబర్ 650-2 పై గత మూడు నెలలుగా పోరాటం చేస్తున్నామని, ఆ సర్వేపై యుద్ధ ప్రాతిపదికన విచారణ జరిపి న్యాయం చేకూర్చే అంతవరకు మా రిలే దీక్షలు ఆగవు అని ఏఐటియుసి కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఏఐటీయూసీ, కార్మిక సంఘం, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు 8 వ రోజు నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ
గత మూడు నెలలుగా ధర్మవరం పట్టణంలో 650-2,సర్వే నంబర్ లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను కోరడం జరిగిందిఅని ,కానీ రెవెన్యూ అధికారులు ఇంతవరకు ఎటువంటి విచారణ చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారు అని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోకపోగా కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు అని తెలిపారు. ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులు గత ఎనిమిది రోజులుగా ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర రిలే దీక్షలు చేస్తున్నారు అని,అయినా కూడా రెవిన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఆర్డీవో స్పందించి కార్మికులు చేస్తున్న రిలే దీక్షల శిబిరం దగ్గరకు వచ్చి కార్మికులకు మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంతవరకు రిలే దీక్షలు కొనసాగిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ,ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం అధ్యక్షులు, గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, ఆదినారాయణ, తాజుద్దీన్,రామకృష్ణ, రామసుబ్బయ్య,మసూద్, సురేంద్ర,నాగేంద్ర, చిన్న,జనార్దన్, షెక్షావలి, గౌస్ లాజం, ఓబులేసు,మహిళా సమైక్య నాయకులు లలితమ్మ, లింగమ్మ,తదితరులు పాల్గొన్నారు.
అవినీతి అక్రమాలపై యుద్ధ ప్రాతిపతకాన విచారణ చేపట్టి న్యాయం చేయాలి
RELATED ARTICLES