Homeగద్దర్‌ అవార్డులు

గద్దర్‌ అవార్డులు

- Advertisement -

. ఉత్తమ చిత్రంగా కల్కి
. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌
. ఉత్తమ నటిగా నివేదా థామస్‌
. 14న అవార్డుల ప్రదానోత్సవం

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను జ్యూరీ ఛైర్‌పర్సన్‌ జయసుధ గురువారం ప్రకటించారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1,248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా ‘పుష్ప 2’ చిత్రానికి గానూ అల్లు అర్జున్‌ ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా కల్కితో పాటు మరో రెండు సినిమాలకు అవార్డులు లభించాయి. మొదటి ఉత్తమ చిత్రం: కల్కి 2898ఏడీ , రెండో ఉత్తమ చిత్రం: పొట్టేల్‌, మూడో ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్‌, ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు, హిస్టరీ – హెరిటేజ్‌ చిత్రం: రజాకార్‌, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆయ్‌, ఉత్తమ పరిచయ దర్శకుడు: యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు), ఉత్తమ దర్శకుడు: నాగ్‌ అశ్విన్‌ (కల్కి), ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప 2), ఉత్తమ నటి: నివేదా థామస్‌ (35 చిన్న కథ కాదు), ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం), ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌), ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (రాజు యాదవ్‌), ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్‌ (రజాకార్‌), ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్‌ శ్రీరామ్‌ (నిజమే నే చెబుతున్నా – ఊరి పేరు భైరవకోన), ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్‌ (సూసేకి అగ్గిరవ్వ – పుష్ప 2), ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తువదలరా 2), ఉత్తమ బాలనటుడు: మాస్టర్‌ అరుణ్‌ దేవ్‌ పోతుల (35 చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్‌), ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి), ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌), ఉత్తమ సినిమాటోగ్రఫర్‌: విశ్వనాథ్‌ రెడ్డి (గామి), ఉత్తమ ఎడిటర్‌: నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌), ఉత్తమ ఆడియోగ్రాఫర్‌: అరవింద్‌ మేనన్‌ (గామి), ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేశ్‌ ఆచార్య (ఆయుధ పూజ – దేవర), ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: అద్నితిన్‌ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ), ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌: కె. చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌), ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌), ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌ కుమార్‌ (కల్కి 2898 ఏడీ).
స్పెషల్‌ జ్యూరీ అవార్డులు…
నటుడు: దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌), నటి: అనన్య నాగళ్ల (పొట్టేల్‌), దర్శకులు: సుజీత్‌, సందీప్‌ (క), నిర్మాతలు: ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి (రాజు యాదవ్‌), స్పెషల్‌ జ్యూరీ స్పెషల్‌ మెన్షన్‌: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2), తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: ‘మన సినిమా ఫస్ట్‌ రీల్‌’ (రెంటాల జయదేవ్‌), 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించారు. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడిరచారు. 2014 జూన్‌ నుంచి 2023 డిసెంబరు 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి, 2014 నుంచి 2023 వరకు సెన్సార్‌ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. తెలుగు చిత్రాలతోపాటు ఉర్దూ చిత్రాలకూ అవార్డుల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత అవార్డులు ఇచ్చారు. జూన్‌ 14న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
గద్దర్‌ అవార్డు అభిమానులకు అంకితం: అల్లు అర్జున్‌
తెలంగాణ ప్రభుత్వం తనకు ప్రకటించిన ప్రతిష్టాత్మక గద్దర్‌ అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్‌ ప్రకటించారు. ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కీర్తి అంతా సుకుమార్‌, నిర్మాతలదే అని, అభిమానులు చూపించే ప్రేమ, మద్దతు నాలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు