న్యూఢల్లీ, మే 07 : భారతదేశం పహల్గాం ఉగ్రదాడికి గట్టిగా బదులిచ్చింది. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌కు ధీటైన జవాబిచ్చింది.24 క్షిపణలు ఏక కాలంలో ఎటాక్ చేయడంతో ఉగ్రవాదులు కకా వికలం అయ్యారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాది స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్‌తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది. 24 క్షిపణలు ఏక కాలంలో ఎటాక్ చేయడంతో ఉగ్రవాదులు కకా వికలం అయ్యారు. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ్షఆపరేషన్ సిందూర్ణ పేరుతో మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. భారత బలగాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా జైష్-ఎ-మొహమ్మద్ మరియు లష్కరే-ఎ-తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు చెందిన 9 స్థావరాలను ఏకకాలంలో ధ్వంసం చేశాయి. దాడులు అత్యంత కచ్చితత్వంతో జరిగాయని భారత సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్ జరిగిన వెంటనే, ్షన్యాయం జరిగింద్ణి అంటూ భారత ఆర్మీ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేసింది. అయితే.. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీని ఫలితంగా శ్రీనగర్‌కు విమాన సర్వీసులను రద్దు చేయడంతో పాటు, ధర్మశాల, లేప్‌ా, జమ్ము మరియు అమృతసర్ విమానాశ్రయాలను మూసివేశారు. సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి.