Thursday, May 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆరోగ్య ఉపకేంద్రం కూల్చివేత పై విచారణ

ఆరోగ్య ఉపకేంద్రం కూల్చివేత పై విచారణ

ఆరోగ్య ఉపకేంద్రం కూల్చివేత పై విచారణ.. డిఎంహెచ్వో డాక్టర్ ఫిరోజా బేగం

విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని గోట్లూరు గ్రామం నందు గల ఆరోగ్య ఉప కేంద్రం కూల్చివేత విషయంపై డిఎంహెచ్వో డాక్టర్ ఫిరోజా బేగం ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఈ ఆరోగ్య ఉపకేంద్రం గూర్చివేతపై కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు అందడం జరిగిందన్నరు. గ్రామంలోని ఇరు వర్గాల పెద్దలు గ్రామ ప్రజల సమక్షంలో విచారణ జరపడం జరిగిందని తెలిపారు. ఇరు వర్గాలు తమ వాదన కట్టుబడి ఉండడం చేత ఏకాభిప్రాయం చేయలేకపోయామని తెలిపారు. దీని కారణంగా సరైన పరిష్కారం కొరకు మరల చర్చలు నిర్వహిస్తామని వారు అధికారపురుకంగా తెలపడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ఆరోగ్య కేంద్రం ఉన్న పాత పంచాయతీ భవనాన్ని డిపిఓ ఇతర పై అధికారుల అనుమతితో శాశ్వతంగా వైద్య శాఖకు కేటాయించాలని వర్గాలను కోరడమైనది అని తెలిపారు. లేనిపక్షంలో పాత ఆరోగ్య ఉపకేంద్రం ఉన్న స్థలము కానీ లేదా ఇతర అనువైన స్థలము కానీ ఆరోగ్య ఉప కేంద్రానికి కేటాయించాలని తెలిపారు. అందులో నూతన భవన నిర్మాణం చేసేలా చూడాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిలీప్ కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాంబశివమ్మ, హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది, పంచాయితీ కార్యదర్శి ఎల్లప్ప, గణేషు, వీఆర్వో విష్ణువర్ధన్, కానిస్టేబుల్ చేతన్ నాయక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు