Homeఅంతర్జాతీయంఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయలేదు

ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయలేదు

- Advertisement -

తులసీ గబార్డ్
వాషింగ్టన్: అణ్వస్త్రాల తయారీకి ఇరాన్ యత్నిస్తున్నందన్న నెపంతో అమెరికాఇజ్రాయిల్ కలిసి ఆ దేశంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతు న్నాయి. విధ్వంసం సష్టిస్తున్నాయి. తీవ్ర ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. విలువైన ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. వాస్తవానికి అమెరికాఇజ్రాయిల్ చెప్పేదానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదని, ఆ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది.ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తున్న ఆరోపణలపై అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబార్డ్ స్పందించారు. సెనెట్ కమిటీకి వివరాలు తెలిపారు. ఆమె చెప్పిన దానికి ట్రంప్ ప్రకటనకు పొంతన లేకపోవడం గమనార్హం. గతేడాది జూన్‌లో ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హామర’లో భాగంగా ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై అమెరికా దాడులు చేసింది. దీంతో ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమం తుడిచిపెట్టుకు పోయింది. తీవ్ర నష్టాల నుంచి కోలుకునే యత్నాలను ఇరాన్ చేసింది. కానీ అణ్వస్త్రాల తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకోలేకపోయింది. వాస్తవానికి తెహ్రాన్ అందుకు ప్రయత్నించలేదని తులసీ గబార్డ్ వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులో జరిపిన దాడిలో అగ్ర నాయకత్వాన్ని కోల్పోయిన ఇరాన్ తన పాలనా సామర్థ్యాన్ని కోల్పోలేదని తులసి తెలిపారు. చైనా, పాకిస్థాన్ అణు క్షిపణులు అభివృద్ధి చేస్తున్నాయని, అమెరికా భూభాగాలను చేరుకోగల సామర్థ్యంతో వాటిని రూపొందిస్తున్నాయని సెనెట్ కమిటీకి తులసీ గబార్డ్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు