తెహ్రాన్: హోర్ముజ్ జలసంధి మార్గంలో నౌకల ప్రయాణానికి సంబంధించి ఇరాన్ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టనున్నది. ఉద్రిక్తతల వేళ జల మార్గంపై నియంత్రణలో మార్పులే లక్ష్యమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయిల్ మిత్ర దేశాల నౌకలను నిరోధించడానికి స్పష్టమైన కారణం ఉందన్నారు. యుద్ధ పరిస్థితుల్లో భద్రతాంశాల దష్ట్యా ఇలాంటి చర్యలు అవసరమని తెలిపారు. ‘హోర్ముజ్ జలసంధి కీలక జలమార్గం. శత్రువులు ఈ మార్గాన్ని వినియోగించకుండా నిరోధించాలి. భద్రతా ముప్ప్పుతో ఇప్పటికే అనేక నౌకలు వెనుదిరిగాయి. భవిష్యత్తులో ఈ మార్గం గుండా నౌకాయానం కోసం కొత్త ప్రోటోకాల్ అవసరం’ అని అరాగ్చీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ జలసంధి గుండా సాగుతుండటంతో, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
‘హోర్ముజ’పై ఇరాన్ కొత్త నిబంధనలు
- Advertisement -
RELATED ARTICLES


