Homeఎస్ ఐ ఆర్ పై స్వయంగా సుప్రీంలో వాదించిన మమత

ఎస్ ఐ ఆర్ పై స్వయంగా సుప్రీంలో వాదించిన మమత

- Advertisement -

న్యూదిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎసఐర్) ప్రక్రియను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. ధర్మాసనం అనుమతితో మమత ఎసఐఆర్‌పై తన వాదనలు వినిపించారు. తాను బెంగాల్ మట్టి నుంచే వచ్చానని, అక్కడ నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆమె కోర్టుకు విన్నవించారు. ‘నేను బెంగాల్ ముఖ్యమంత్రిగా అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాను. గౌరవనీయ న్యాయమూర్తులపై నాకు అత్యంత గౌరవం ఉంది. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు… బెంగాల్ ప్రజల హక్కుల కోసం చేస్తున్న పోరాటం’ అని మమత స్పష్టం చేశారు. న్యాయం తలుపుల వెనుక దాడి ఉందని మమత వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై తాను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అనేక లేఖలు రాశానని, అయితే ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఆమె న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రక్రియ సాకుతో ప్రజల పేర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగిస్తున్నారని, ముఖ్యంగా వివాహమై అత్తవారింటికి వెళ్లిన మహిళల పేర్లను ‘నేమ్ మిస్ మ్యాచ’ పేరుతో తొలగించడం దారుణమని ఆమె మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని… ఈ సవరణలు చేపడుతున్నారని మమత ఆరోపించారు. ఈ ప్రక్రియ వల్ల ఏర్పడిన పని ఒత్తిడితో ఇప్పటికే పలువురు బూత్ స్థాయి అధికారులు (బీఎలఓ) ప్రాణాలు కోల్పోయారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆమె సుప్రీంకోర్టును వేడుకున్నారు. ఎలఎల్‌బీ డిగ్రీ కలిగిన మమత… ఈ కేసులో తన వాదనలు స్వయంగా వినిపించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ మధ్యంతర దరఖాస్తు సమర్పించారు. కోర్టు నిబంధనలు, గౌరవ మర్యాదలపై తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యాంగ రక్షణ కోసం తానే నేరుగా వాదనలు వినిపిస్తానని ఆమె కోర్టుకు విన్నవించారు. కాగా కేసు తదుపరి విచారణను సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టిన మమతా బెనర్జీ ముందుగా తన బృందం సభ్యులతో మాట్లాడారు. దీనికి ముందు మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)పై ఘాటు విమర్శలు చేశారు. చిన్నపాటి వ్యత్యాసాల సాకుతో వేలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించే ప్రమాదం ఉందని ఆమె ఆరోపించారు. 2022 ఓటర్ల జాబితాలో ఉన్న ఎవరి పేరునూ తొలగించవద్దని, ఆధార్ కార్డ్, పంచాయతీ ధృవీకరణ పత్రాలను సరైన గుర్తింపు కార్డులుగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాలు లక్ష్యంగా ఈ ప్రక్రియ సాగుతోందని, ఇది ప్రజాస్వామ్యానికే ముప్ప్పు అని ఆమె ఆరోపించారు. బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ అంశంపై శివసేన (యూబీటీì) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలను ఉపయోగించి బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. మమతా బెనర్జీ నేరుగా దీనిపై కోర్టులో పోరాటం చేయడాన్ని స్వాగతిస్తూ… రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆమె అన్నారు. మమతా బెనర్జీ రాకతో సుప్రీం కోర్టు వెలుపల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భగవాన్ దాస్ రోడ్, పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు