Homeతెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్ పంజా

తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్ పంజా

- Advertisement -

. ఐదేళ్లలో 44 వేల మంది మతి
. ఏపీ పరిస్థితి మరింత ఆందోళనకరం
. కేంద్రం నివేదిక వెల్లడి

న్యూదిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్ రక్కసి మళ్లీ పడగ విప్ప్పుతోంది. ఒకప్ప్పుడు ఊరూరా జరిగిన అవగాహన ప్రచారం… ఇప్ప్పుడు అటకెక్కడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గత ఐదేళ్లలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరణాల లెక్కలు చూస్తే వణుకుపుట్టాల్సిందే. రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించిన వివరాల ప్రకారం… గత ఐదేళ్లలో (2020-2024) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 44,140 మంది ఎయిడ్స్ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం 1.81 లక్షల మరణాల్లో ఒక్క తెలుగు రాష్ట్రాల వాటాయే 25 శాతంగా ఉండటం గమనార్హం. అంటే దేశంలో ఎయిడ్స్‌తో చనిపోతున్న ప్రతి నలుగురు బాధితుల్లో ఒకరు మన తెలుగు వారే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఏపీలో గత ఐదేళ్లలో 32,642 మంది చనిపోగా, తెలంగాణలో 11,498 మంది మరణించారు. ఒకప్ప్పుడు హెచఐవీ నియంత్రణలో ఆదర్శంగా ఉన్న రాష్ట్రాలు ఇప్ప్పుడు మరణాల రేటులో అగ్రస్థానంలో ఉండటం గందరగోళానికి గురిచేస్తోంది. వలస కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండటం, సురక్షితం కాని లైంగిక సంబంధాలు, అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు మొక్కుబడిగా సాగడం ఈ మరణాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం ఏఆర్‌టీ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ మరణాలు పెరగడానికి సామాజిక వివక్ష ప్రధాన అడ్డంకిగా మారింది. సమాజం తమను ఏమనుకుంటుందో అన్న భయంతో చాలామంది చికిత్సకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు మందులను మధ్యలోనే ఆపేస్తున్నారు. కరోనా సమయంలో మందుల సరఫరాలో తలెత్తిన ఆటంకాలు కూడా బాధితుల ఆరోగ్యంపై దెబ్బకొట్టాయి. పౌష్టికాహార లోపం, గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి చేరుకోవడం కూడా మరణాల సంఖ్యను పెంచుతోంది. గతంలో ఉన్నట్టుగా ఇప్ప్పుడు నాకో, ఏపీ సాక్స్ వంటి సంస్థలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం లేదు. ప్రజల్లో ఎయిడ్స్ అంటే భయం పోయి… నిర్లక్ష్యం పెరిగింది. నివారణే ఏకైక మార్గమని, సురక్షిత అలవాట్లు పాటించకపోతే ముప్ప్పు తప్పదని కేంద్ర గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏఆర్‌టీ సెంటర్లను బలోపేతం చేయడంతో పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరో దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే… ఐటీ రంగంలో హెచఐవీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ విషయాన్ని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ వ్యవస్థ వెల్లడించింది. విదేశీ తరహా జీవనశైలికి అలవాటు పడటం ఐటీ రంగంలో హెచఐవీ వ్యాప్తికి కారణమవుతోందని తెలిపింది. ఈ రంగంలో హెచఐవీ పరీక్షల సంఖ్య పెంచాల్సి ఉందని సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు