తేజస్వీ యాదవ్‌తో భేటీలో డి.రాజా
సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా బీహార్ రాజధాని పట్నాలో ఆర్‌జేడీ నాయకుడు, మహాకూటమి సమన్వయ కమిటీ చైర్మన్ తేజస్వీ యాదవ్‌తో మంగళవారం భేటీ అయ్యారు.
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా బీహార్ రాజధాని పట్నాలో ఆర్‌జేడీ నాయకుడు, మహాకూటమి సమన్వయ కమిటీ చైర్మన్ తేజస్వీ యాదవ్‌తో మంగళవారం భేటీ అయ్యారు. బీహార్‌లో వామపక్షాలు, లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు బలం పెంచుకోవడంపై చర్చించారు. బీహార్‌లో 24 స్థానాల్లో పోటీ చేయాలని సీపీఐ ప్రతిపాదించింది. అయితే దీనిపై రాజా, తేజస్వి మధ్య సుదీర్ఘమంతనాలు జరిగాయి. ప్రజలు మెచ్చే రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నారు.
ఐక్యంగా, బలంగా ముందుకెళదామని, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని డి.రాజా అన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ్ నరేశ్ పాండే, జాతీయ కార్యదర్శి సంజయ్ కుమార్, జాతీయ సమితి సభ్యుడు అజయ్ కుమార్ సింగ్, ఆర్‌జేడీ నాయకులు అబ్దుల్ బారి సిద్దిఖీ, సంజయ్ యాదవ్ (ఎంపీ), ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మగ్నీలాల్ మండల్, జాతీయ ప్రధాన కార్యదర్శి భోలా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై మరోసారి సమావేశం కావాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు.


