ఖాట్మండు: ఐక్యతా స్ఫూర్తి`సందేశంతో నేపాలీ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ) ముందుకు వెళుతోంది. వామపక్ష పార్టీలు ఏకీకృతంగా నేపాలీ కమ్యూనిస్టు పార్టీగా ఆవిర్భవించాయి. తమ బలాన్ని సంస్థాగతంగా పెంచుకోనేందుకు, ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు కార్యాచరణ రూపొందించుకునే పనిలో ఎన్సీపీ నాయకులు నిమగ్నమయ్యారు. ఇదే క్రమంలో ఎన్సీపీ సమన్వయకర్త ప్రచండ నాయకత్వంలో పారిస్దండలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అగ్ని ప్రసాద్ సప్కోట ఓ ప్రకటన చేశారు. మరింత సమర్థంగా, క్రమబద్ధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం, దీర్ఘకాలిక సంస్థాగత లక్ష్యసాధనపై దృష్టి పెట్టినట్లు వెల్లడిరచారు. ఐక్యతా సందేశంతో అన్ని ప్రావిన్సులలో ఐక్యతా స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ… సభ్యులను, దేశవ్యాప్తంగా ఉన్న మద్దతుదారులను ఏకతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కార్యక్రమాల కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్లు వెల్లడిరచారు. సార్వత్రిక ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టాలని సమావేశం సూచించిందన్నారు. ప్రజలను చైనత్యపర్చడం కోసం స్థానిక కమిటీలతో సమన్వయం పెంచుకోవాలని, అనుబంధ సంస్థలు, ప్రజా సంఘాలు, సమాఖ్యలతో భాగస్వామ్యం పెంచుకోవాలని మార్గదర్శకం అందించినట్లు తెలిపారు. సోదరి సంస్థలలో కలిసి ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చుకొనే లక్ష్యంతో విస్తృత ప్రచారానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవడంపై నేతలు దృష్టిని కేంద్రీకరించినట్లు వెల్లడిరచారు.
ఐక్యతా స్ఫూర్తితో ముందుకు: ఎన్సీపీ
- Advertisement -
RELATED ARTICLES


