బి.రామారావు
సుమారు 3,000 సంవత్సరాల క్రితమే తెలంగాణతో పాటు సమీప ప్రాంతాల్లో నివసించిన ప్రాచీన సమాజాలకు ఖగోళ శాస్త్రంపై విశేష అవగాహన ఉన్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి Vౖ²దరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర విభాగానికి చెందిన గౌరవ ప్రొఫెసర్ కే.పీ.రావు వివరించారు. దిక్కులను గుర్తించడంలో వారికి ఎంతో నైపుణ్యం ఉందన్నారు. వరంగల్‌లోని సరస్వతి ఆలయం సమీపంలో చేపట్టిన పరిశోధనల్లో నక్షత్ర సమూహాల ప్రతిరూపంతో పాటు కొన్ని శిల్పాలు లభించాయన్నారు. ఇండస్ లోయ నాగరికత తర్వాతే శిల్పకళ అంతరించిపోయి, మౌర్యుల కాలంలో మళ్లీ పునరుజ్జీవించిందన్న అభిప్రాయాన్ని ఈ పరిశోధనలు వెల్లడిస్తున్నాయన్నారు.
ఈ పరిజ్ఞానం కనీసం క్రీ.పూ.1000 సంవత్సరాల నాటిదై ఉండొచ్చని అంచనా వేశారు. తెలంగాణలోని నారాయణపేట జిలాలో ప్రాచీన రాతి కట్టడాలే ముడుమల్ మెన్హిర్స్ ఉన్నట్లు ఆధారాలు లభించాయన్నారు. ములుగులోని అక్షరాలదొడ్డి వద్ద మేగలిథిక్ù కాలానికి చెందిన శిలా చిత్రాలను డా.ప్రవీణ్ రాజు గుర్తించారన్నారు. ఇవి ఎక్స్‌రే చిత్రాల మాదిరిగా, మానవ శరీరంలోని ఎముకల నిర్మాణం స్పష్టంగా కనిపించేలా ఉన్నాయని వివరించారు. ఈ ప్రాంతాన్ని చరిత్రకారుడు డా.దయానపల్లి సత్యనారాయణ కనుగొన్నారు. జగిత్యాలలోని గజగిరిగుట్ట వద్ద లభించిన సమాధుల్లో మట్టిపాత్రలు ఉంచి ఆనవాళ్లు, ఉత్తర తెలంగాణలోని పాడుగొనివుడెం వద్ద మేగలిథిక్ సమాధుల్లో మహిళా రూపంతో కూడిన శిల్పం లభించాయి.
ఇలాంటి శిల్పాలు ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో లభ్యమై, అవి సుమారు క్రీ.పూ. 1000 సంవత్సరాల నాటివని ఇవి ఇండస్ లోయ నాగరికత తర్వాత శిల్ప సంప్రదాయం నిలిచిపోయిందన్న భావనను ఖండిస్తున్నాయని ప్రొఫెసర్ రావు అంచనా వేసారు. తెలంగాణలో శిల్పకళ నిరంతరంగా కొనసాగిందని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. సముద్రాల సునీల్ అనే ఫ్రీలాన్స్ ప్యాలియో-ఆర్కియాలజిస్ట్ మాట్లాడుతూ నదీ తీరాలు, కాలువల వెంట ప్రాచీన నివాస ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు.
మెదక్ జిల్లా పులురుబండ వద్ద తవ్వకాలలో కైర్న్స్, డాల్మెన్స్ సంస్కృతి పై విలువైన సమాచారం లభించిందన్నారు చరిత్రకారుడు డా.సత్యనారాయణ. రాష్ట్రంలో అనేక శిలాచిత్ర ప్రాంతాలు గుర్తించినప్పటికీ, వారసత్వ శాఖ అనుమతుల కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఖమ్మం జిల్లా జనంపేటలోని మేగలిథిక్ స్థలంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలు ప్రారంభించింది. 1950ల నుంచి రక్షణలో ఉన్న ఈ స్థలంలో రాతి శవపేటికలు, ఎముకల ముక్కలు, మట్టిపూసలు లభించినట్లు పురావస్తుశాఖ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ తెలిపారు. ఖచ్చితమై కాల నిర్ధారణపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్. ఫోన్ : 9030715343


