న్యూఢిల్లీ: భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో (ఎస్ఎంఈ) పెట్టుబడులు పెట్టేందుకు సెబీ కేటగిరీ1 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)గా గెట్ఫైవ్ ఫండ్స్కు సెబీ అనుమతి లభించింది. దీనికోసం రూ.500 కోట్ల లక్ష్య నిధితో గెట్ఫైవ్ ఆపర్చునిటీ ఫండ్2ను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది సంస్థ నుంచి వస్తున్న రెండో ఫండ్. రక్షణ, ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ, డీప్ టెక్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, తయారీ, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, టెక్నాలజీ, ఆర్థిక సేవలు, వినియోగ వస్తువులు, రిటైల్, అగ్రిటెక్, లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థ, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, విద్య, వ్యర్థాల నిర్వహణ రంగాల్లోని సంస్థలకు ఈ ఫండ్ ద్వారా పెట్టుబడులు అందించనున్నారు. గెట్ఫైవ్ ఆపర్చునిటీ ఫండ్2 కూడా సంస్థ అనుసరిస్తున్న వి3 (వీ క్యూబ్), గ్రోత్ ఇన్వెస్టింగ్ విధానాన్ని కొనసాగించనుంది. ప్రమోటర్ విజన్, కంపెనీ విలువ, పరిశ్రమలో వృద్ధి వేగం ఆధారంగా పెట్టుబడి అవకాశాలను అంచనా వేయనున్నారు. దీర్ఘకాలిక విలువ సృష్టించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అనుసరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఫండ్కు గెట్ఫైవ్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ గోయల్ నేతృత్వం వహించనున్నారు. ఎస్ఎంఈల్లో పెట్టుబడుల అవకాశాలపై శ్రీకాంత్ గోయల్ మాట్లాడుతూ ఈ రంగంలో పెట్టుబడుల ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు. రానున్న మూడు, నాలుగేళ్లలో బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్¨ వేదికలపై సుమారు 400 ఎస్ఎంఈలు లిస్ట్ అవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
గెట్ఫైవ్ ఆపర్చునిటీ ఫండ్2 ఏర్పాటుకు సెబీ అనుమతులు
- Advertisement -


