వి.శంకరయ్య
సహజంగా రాష్ట్రాల మధ్య జుట్లు పందేలు పెట్టే కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా కృష్ణానది జలాల వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ నియమించింది. గాని గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుంది. కృష్ణా గోదావరి నదీజలాల వాటాలు తేల్చేందుకు ఒకే రోజు ట్రిబ్యునల్స్ వేయాలని 2020 లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్భిద్దితో 2023 ఎన్నికల్లో తెలంగాణలో లబ్ది పొందేందుకు నాలుగేళ్లుగా దస్త్రాలకే పరిమితమైన కృష్ణానదీ జలాల వివాద ట్రిబ్యునల్ ప్రతి పాదన దుమ్ము దులిపి ట్రిబ్యునల్ వేసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గొంతుకోసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచి కృష్ణ నదీ జలాల వివాదం తెలంగాణ అవశేష ఆంధ్ర ప్రదేశ్ మధ్య రావణ కాష్టంలాగా రగులుతోంది. కేసీిఆర్ తో జగన్‌మోహన్ రెడ్డి సాగించిన చెలిమి అంతిమంగా కొత్తగా ట్రిబ్యునల్ నియామకానికి దారి తీసింది. నదీ జలాల పంపిణీ అంశంపై రాష్ట్ర విభజన చట్టంలో అనువైన సెక్షన్‌లు వున్నా 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 కింద కొత్త ట్రిబ్యునల్ నియామకానికి కేసీిఆర్ పన్నిన కుట్రలో జగన్‌మోహన్ రెడ్డి చిక్కుకొని 2020 లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో డీసెంట్ నోట్ పెట్టక పోవడంతో కొత్త ట్రిబ్యునల్ నియామకం జరిగి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు గుండెలు మీద కుంపటిలాగా తయారైంది. ఇప్పుడు గోదావరి జలాల వివాదం కూడా పీటముడిపడి నానాటికీ బిగుసుకొంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలగా చేపడుతున్న గోదావరి బనకచర్ల అనుసంధానం పథకంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించదలచినట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ప్రకటించారు, రెండు రోజులు క్రితం నీటి పారుదల ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎంతో కొంత సామరస్యంగా పరిష్కారమౌతాయని భావించిన వారికి ఆశాభంగమే మిగిలింది. ఈ అస్తవ్యస్త పరిస్థితి అంతిమంగా నిత్య కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు శరాఘాతంగా మిగిలి పోతోంది.
కృష్ణా నదీ జలాల వివాదం లాగే ఉభయ రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వాటా కూడా పదేళ్లు గడచినా తేల లేదు. గమనార్హమైన అంశమేమంటే కృష్ణానదిలో ఎప్పుడో గాని వరద జలాలు వుండవు. గోదావరి నదిలో ఆలా కాదు. ప్రతి ఏటా వందలాది టీఎంసీిల నీళ్లు సముద్రం పాలైతున్నాయి. ఈ ఏడు గరిష్టంగా 4136. 96 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనవి. అయినా రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడుతున్నదంటే పక్క పక్క రాష్ట్రాల మధ్య వుండ వలసిన సామరస్యం కొరవడటమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలకు పొగ బట్టడం కూడా కారణంగా వుంది. గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1486.85 టీఎంసీలను కేటాయించినది. ఏటా సముద్రంలో ఇంతకు రెండిరతలు టీఎంసీల నీళ్లు సముద్రం చేరుతోంది. కాని రెండు రాష్ట్రాల మధ్య జగడం తప్పడం లేదు. గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన 1486.85 నికర జలాల్లో తమ వాటా 957.85 టీఎంసీిలని ఆంధ్ర ప్రదేశ్ వాటా 518.85 టీఎంసీలని తెలంగాణ విభజన నాటి నుంచి చెబుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ఇందుకు భిన్నంగా తమ వాటా 7 78 టీఎంసీిలని, తెలంగాణ వాటా 658 టీఎంసీలని వాదిస్తోంది. సహజంగా రాష్ట్రాల మధ్య జుట్లు పందేలు పెట్టే కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా కృష్ణానది జలాల వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ నియమించింది. గాని గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుంది.
కృష్ణా గోదావరి నదీజలాల వాటాలు తేల్చేందుకు ఒకే రోజు ట్రిబ్యునల్స్ వేయాలని 2020 లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్భిద్దితో 2023 ఎన్నికల్లో తెలంగాణలో లబ్ది పొందేందుకు నాలుగేళ్లుగా దస్త్రాలకే పరిమితమైన కృష్ణానదీ జలాల వివాద ట్రిబ్యునల్ ప్రతి పాదన దుమ్ము దులిపి ట్రిబ్యునల్ వేసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గొంతుకోసింది. తదనంతరం మూడేళ్లు కాలం అధికారంలో ఉన్న జగన్‌మోహన్ రెడ్డి ఏ నాడూ కేంద్ర ప్రభుత్వాన్ని గోదావరి ట్రిబ్యునల్ వేయమని అడిగిన పాపాన పోలేదు. కృష్ణానదిపై ట్రిబ్యునల్ నియామకం కోరి సాధించుకున్న తెలంగాణ అప్పుడూ ఇప్పుడూ గోదావరి ట్రిబ్యునల్ నియామకానికి మోకాలడ్డుతోంది. పోనీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన దాఖలా లేదు. ఆ మాట కొస్తే అంతర్ రాష్ట్ర జల వివాదాలపై ముఖ్యమంత్రి అంతగా దృష్టి పెట్టడం లేదు. పైగా గోదావరి బనకచర్ల అనుసంధానం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నొక్కి చెబుతూ తెలంగాణకు స్నేహ హస్తం అందించారు. గోదావరి నదిపై ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి, ఎన్ని నీళ్లయినా తీసుకోండని ఒక విధంగా పరిధి దాటి స్వాగతించారు. కాని తెలంగాణ వేపు నుంచి ప్రతికూల స్పందన వచ్చి గోదావరి బనకచర్ల అనుసంధానం పైననే కాకుండా రాయలసీమ ఎత్తిపోతల పై కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు
మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆ మాట కొస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్ని నీళ్లయినా తీసుకోండని చెప్పడం సరికాదు. ఈ అంశంలో జల వనరులు శాఖాధికారులు ముఖ్యమంత్రికి సరైన ఫీడిరగ్ ఇచ్చినట్లు లేదు. కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి కావేరి అనుసంధానానికే గోదావరిలో మిగులు నీళ్లు లేవని కేంద్ర జల సంఘం తేల్చి చెప్పింది. అందుకే ఛత్తీస్‌గఢ్‌్ మిగులు వాటా నీళ్లు డీపీిఆర్ లో చేర్చారు. ఏ పథకం డీపీఆర్ ఆమోదం పొందాలన్నా కేంద్ర జల సంఘం తమ వద్ద వున్న కొలబద్ద ఆధారంగా అనుమతులు ఇస్తుంది. వాస్తవంలో తెలంగాణకు చెంది ఆరేడు ప్రాజెక్టుల డీపీఆర్‌లు నికర జలాలు లేకుండా కేంద్ర జల సంఘం వద్ద పెండిరగ్ లో వున్నాయి.
అంతర్ రాష్ట్ర జల వివాదంగా మిగిలిన గొంతెండి పోతున్న శ్రీ కాకుళం జిల్లా వాసులకు జీవధారగా వున్న వంశధార నాగావళి అనుసంధానం ఒడిశా సుప్రీంకోర్టు కెక్కినందన నిలిచి పోయి వుంది. ఒడిశాలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వుంది. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఒడిశా ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపితే సులభంగా సమస్య పరిష్కారమౌతుంది. కేవలం 40 కోట్ల రూపాయల వ్యయంతో అనుసంధానం జరిగి పోతుంది. జగన్‌మోహన్ రెడ్డి ఈ పని చేయలేక 180 కోట్లతో ఎత్తిపోతల పథకం పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా అంతర్ రాష్ట్ర జల వివాదాలపై దృష్టి పెట్ట వలసి ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి కూడా గోదావరి బనకచర్ల అనుసంధానం గురించి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా జూన్ కల్లా టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కాని రాష్ట్ర విభజన చట్టం మేరకు కృష్ణాగోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే ముందుగా ఆయా నదీ జలాల యాజమాన్య బోర్డుల అనుమతి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం వుండాలనే అంశాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఇప్పుడు లేవ నెత్తారు. తమాషా ఏమంటే గోదావరిపై గాని కృష్ణానదిపై గాని తెలంగాణ కెేసీఆర్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ కొత్తవే. కేసీఆర్ పాత ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేస్తున్నామని పబ్బం గడుపు కున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రతి పాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టునే కాళేశ్వరం ప్రాజెక్టు చేశారు. అయిదేళ్ల కాలం కేసీిఆర్ తో అలాయ్ బలాయ్ ఆడిన జగన్‌మోహన్ రెడ్డి మిన్న కుండి పోయారు. ఇదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ఏకుమేకై కూర్చుండ బోతోంది. ఇప్పటికైనా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖతో సరిపెట్టకుండా ప్రధాన మంత్రి స్థాయిలో ఒత్తిడి తెచ్చి గోదావరి ట్రిబ్యునల్ నియమింప చేసుకోవలసి వుంది. ట్రిబ్యునల్ నియామకం జరిగితే తెలంగాణ వేపు నుంచి కొంత మేర ఒత్తిడి తగ్గుతుంది.
విశ్రాంత పాత్రికేయులు 9848394013